Begin typing your search above and press return to search.
ఓకే అన్నా..అవసరాల నమ్మలేదు-నారా రోహిత్
By: Tupaki Desk | 19 Sep 2016 5:02 AM GMT‘జ్యో అచ్యుతానంద’ కథను తాను కొందరు పేరున్న హీరోలకు కూడా చెప్పానని.. కానీ వాళ్లెవరూ ఒప్పుకోలేదని.. చివరికి నారా రోహిత్ కు చెప్పగా అతను ఓకే అన్నాడని.. అయినప్పటికీ అతను తర్వాత నో అంటాడేమో అనుకున్నానని ఈ చిత్ర ఆడియో వేడుకలో అవసరాల శ్రీనివాస్ అన్న సంగతి తెలిసిందే. ఇదే విషయమై నారా రోహిత్ ఇప్పుడు మాట్లాడుతూ.. అప్పట్లో తాను ఈ సినిమా చేస్తానని అవసరాలను ఒప్పించడానికి చాలా కష్టమైందన్నాడు. తాను ఓకే అన్నా కూడా రెండు రోజులు టైం తీసుకుని తర్వాతే చెప్పమని అవసరాల అన్నట్లు వెల్లడించాడు.
‘‘అవసరాల శ్రీనివాస్ డైరెక్ట్ చేసిన ఊహలు గుసగుసలాడే సినిమా టీవీలో చూశాను. చాలా బాగా చేశాడు. అతను దర్శకుడిగా ఇంకో సినిమా మొదలుపెట్టలేదేంటి.. కథలు రాయట్లేదా.. అనుకున్నాను. అలా అనుకున్న నెల రోజులకు నన్ను కలిసి ఓ కథ ఉంది వింటారా అని అడిగాడు. నేను ఓకే అన్నాను. కథ విన్న వెంటనే నేను సినిమా చేస్తున్నట్లు చెప్పాను. అయినా శ్రీనివాస్ నమ్మలేదు. పర్వాలేదు.. రెండు రోజులు ఆలోచించుకుని.. ఆ తర్వాత చెప్పండి అన్నాడు. ఆ తర్వాత రోజు నిర్మాత సాయిగారు ఫోన్ చేసి నేను ఓకే అన్నట్లు అతడికి చెప్పాక కానీ నమ్మలేదు’’ అని నారా రోహిత్ చెప్పాడు.