Begin typing your search above and press return to search.

21 కిలోలు తగ్గిన హీరో

By:  Tupaki Desk   |   12 July 2017 11:26 AM GMT
21 కిలోలు తగ్గిన హీరో
X
నారా రోహిత్ పేరెత్తగానే బొద్దుగా ఉండే రూపం గుర్తుకొచ్చేది. రోహిత్ చేసిన సినిమాలు.. అతను ఎంచుకున్న వైవిధ్యమైనక కథలు.. పాత్రల విషయంలో ప్రశంసలు అందుకున్నప్పటికీ అతడి లుక్ విషయంలో మాత్రం విమర్శలు వ్యక్తమయ్యేవి. కానీ ఆ లుక్ మార్చుకోవడానికి కొంచెం ఎక్కువ సమయమే తీసుకున్నాడు రోహిత్. ఎట్టకేలకు అతడి అవతారం మారింది. బాగా బరువు తగ్గి స్లిమ్ లుక్ లోకి వచ్చేశాడు రోహిత్.

ఐతే బరువు తగ్గడమంటే ఐదు కిలోలో.. పది కిలోలో కాదు.. ఏకంగా 21 కిలోలు తగ్గిపోయాడట రోహిత్. కొన్ని నెలల నుంచి జిమ్ లో రోజూ కొన్ని గంటల పాటు శ్రమిస్తూ అదనపు కేలరీలన్నీ తగ్గించేశాడు రోహిత్. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను గత కొన్ని నెలల్లో 21 కిలోలు తగ్గినట్లు చెప్పాడతను. ఐతే ఈ నెలలోనే విడుదల కాబోయే ‘శమంతకమణి’.. ‘కథలో రాజకుమారి’ సినిమాల్లో రోహిత్ కొత్త లుక్ చూడలేమట. వీటిలో పాత అవతారంలోనే దర్శనమివ్వనున్నాడతను.

పవన్ మల్లెల అనే కొత్త దర్శకుడితో చేస్తున్న సినిమాలో తన కొత్త లుక్ చూడొచ్చని రోహిత్ చెప్పాడు. అందులో తన లుక్ పూర్తి భిన్నంగా ఉంటుందన్నాడు. అది కొత్త జానర్లో తెరకెక్కుతున్న సినిమా అని.. కానీ కమర్షియల్ గా బాగా వర్కవుటయ్యే సినిమా అని అతను చెప్పాడు. రోహిత్ సిక్స్ ప్యాక్ కూడా చేశాడని.. ఆ సినిమాలో అది చూపిస్తాడని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. దీంతో పాటు ‘వీరభోగ వసంతరాయలు’ అనే సినిమా కూడా చేస్తున్నాడు రోహిత్. అందులో అతను మరోసారి పోలీస్ పాత్ర చేస్తుండటం విశేషం.