Begin typing your search above and press return to search.

నారా వారబ్బాయి భలే మాట్లాడాడుగా

By:  Tupaki Desk   |   11 Nov 2017 6:10 AM GMT
నారా వారబ్బాయి భలే మాట్లాడాడుగా
X
నారా రోహిత్ నటించిన బాలకృష్ణుడు మూవీ ఇప్పుడు రిలీజ్ కి రెడీ అయిపోయింది. ఫస్ట్ లుక్ నుంచి ఆకట్టుకున్న ఈ చిత్రానికి.. ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించారు. ఈ ఫంక్షన్ లో తన మాటలతో ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకున్నాడు నారా రోహిత్. ఈ యంగ్ హీరో మాటల్లో మెచ్యూరిటీ.. చెబుతున్న విషయంలో అంతటి స్పష్టత.. అభిమానులను తెగ మెప్పించేశాయి.

అందరికీ నమస్కారం అంటూ తన స్పీచ్ స్టార్ట్ చేసిన నారా రోహిత్.. 'ఆడియో ఫంక్షన్ కి విచ్చేసిన సమంత గారికి.. సాయి ధరం తేజ్ కు.. నాగ శౌర్యకు కృతజ్ఞతలు. కమర్షియల్ సినిమా చేద్దామని చాలా రోజులుగా అనుకుంటున్నా. అలాంటి సమయంలో అజయ్ ఈ కథ చెప్పాడు. రైటర్ రాజా.. డైరెక్టర్ పవన్ నేను ఈ మూవీ చేయడానికి ముఖ్య కారణం. కమర్షియల్ సినిమా నేను చేస్తానని నమ్మినందుకు వారికి థ్యాంక్స్. మణిశర్మ గారితో ఇది నాకు నాలుగో సినిమా. ఇది కూడా హిట్ కావాలని కోరుకుంటున్నా. నేను ఎక్కువగా మాట్లాడాలని అనుకోవడం లేదు. నాకంటే సినిమా ఎక్కువగా మాట్లాడాలని కోరుకుంటున్నా. అందరూ సినిమా చూసి ఆశీర్వదించండి. నవంబర్ 24న సినిమా రిలీజ్ అవుతుంది' అని చెప్పాడు నారా రోహిత్.

'ఈ సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేశాం. నేను తగ్గడానికి కారణం పవన్. నేను ఇలా అయినందుకు ఎవరైనా థ్యాంక్స్ చెప్పాలంటే పవన్ కు చెప్పేయండి' అన్న నారా రోహిత్.. బాలకృష్ణ అభిమానులు.. నందమూరి అభిమానులు.. తారక్ అభిమానులు అందరూ వచ్చారు.. మనమంతా ఓ కుటుంబం.. జై బాలయ్య.. అంటూ ఇచ్చిన ఫినిషింగ్ టచ్ అయితే.. ఫ్యాన్స్ ని తెగ మెప్పించేసింది.