Begin typing your search above and press return to search.
నారా రోహిత్ కు భలే కలిసొస్తోందిగా
By: Tupaki Desk | 8 Sep 2016 5:30 PM GMTగత వేసవిలో నెలన్నర వ్యవధిలో మూడు సినిమాలతో పలకరించాడు. కానీ అవి ఆశించిన ఫలితాల్నివ్వలేదు. ఇప్పుడు వారం వ్యవధిలో రెండు సినిమాలతో రాబోతున్నాడు నారా వారబ్బాయి. ఈ శుక్రవారం ‘జ్యో అచ్యుతానంద’ మంచి అంచనాల మధ్య రిలీజవుతుంటే.. ఆ తర్వాతి వారం రోహిత్ లాంగ్ డిలేయ్డ్ మూవీ ‘శంకర’ కూడా విడుదల కాబోతోంది.
ఈ రెండు సినిమాలూ మంచి టైమింగ్ లో వస్తుండటంతో కంటెంట్ ఉంటే రెండూ బాగానే ఆడేందుకు మంచి అవకాశాలున్నాయి. ‘జనతా గ్యారేజ్’ తొలి వారాంతంలో ఎంత దుమ్ముదులిపినా.. రెండో వారాంతంలో ఆ రేంజిలో హవా ఉండదు. విక్రమ్ ‘ఇంకొక్కడు’ మీద అంత హైప్ లేదు. కాబట్టి ‘జ్యో అచ్యుతానంద’ అంచనాలకు తగ్గట్లు ఉంటే రోహిత్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్టవడం గ్యారెంటీ.
ఇక తర్వాతి వారం ‘శంకర’కు ఒక పెద్ద అడ్డు తొలగిపోయింది. 16నే రావాల్సిన నాని సినిమా ‘మజ్ను’ వారం వాయిదా పడింది. ‘శంకర’కు ఇది బాగా కలిసొచ్చే అంశమే. దీనికి పోటీగా నాగార్జున కీలక పాత్ర పోషించిన ‘నిర్మలా కాన్వెంట్’ రిలీజవుతుంది. ఐతే ఎంతైనా పిల్లల సినిమా అనే ముద్ర ఉంది కాబట్టి.. అది లీడ్ తీసుకునే అవకాశాలు లేవు. ‘శంకర’ తమిళ హిట్ మూవీ ‘మౌనగురు’కు రీమేక్. కంటెంట్ ఉన్న సినిమా కావడంతో ఆలస్యమైనా సరే.. టాక్ పాజిటివ్ గా వస్తే మంచి రిజల్టే రావచ్చు. మరి ఈ రెండు సినిమాలు నారా బాబుకు ఎలాంటి ఫలితాన్నిస్తాయో చూద్దాం.