Begin typing your search above and press return to search.
డైరెక్ట్ ఓటీటీ విడుదలకు 'నారప్ప'..?
By: Tupaki Desk | 26 April 2021 1:30 PM GMTవిక్టరీ వెంకటేష్ హీరోగా దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కిస్తున్న లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ''నారప్ప''. వి క్రియేషన్స్ కలైపులి ఎస్.థాను సమర్పణలో సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సురేష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇది ధనుష్ హీరోగా నటించిన తమిళ సూపర్ హిట్ 'అసురన్' చిత్రానికి తెలుగు రీమేక్. సమ్మర్ కానుకగా మే14న ఈ చిత్రాన్ని థియేట్రికల్ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇంతకముందు ప్రకటించారు. అయితే ఇప్పుడు కోవిడ్ నేపథ్యంలో అనేక సినిమాలు విడుదల తేదీలను వాయిదా వేసుకున్నట్లే, ఈ మూవీ కూడా పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని టాక్ వచ్చింది. దీనికి తగ్గట్టుగానే ఉగాది సందర్భంగా వదిలిన పోస్టర్ లో రిలీజ్ డేట్ ప్రస్తావించలేదు. ఈ క్రమంలో 'నారప్ప' చిత్రాన్ని డైరెక్ట్ ఓటీటీ విడుదల చేసే ఛాన్స్ ఉందని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.
కరోనా మహమ్మారి కారణంగా గతేడాది చాలా సినిమాలు డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ కి వెళ్లాయి. అయితే లాక్ డౌన్ ఎత్తేసి థియేటర్స్ రీ ఓపెన్ చేయడంతో మళ్ళీ థియేట్రికల్ రిలీజులు ఊపందుకున్నాయి. అయితే ఇప్పుడు మళ్లీ కోవిడ్ సెకండ్ వేవ్ తో గతేడాది పరిస్థితులే పునరావృతం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో సినిమాలు ఓటీటీ బాట పట్టే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. దీంతో వెంకటేశ్ నటించిన 'నారప్ప' సినిమా డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అవుతుందని.. రెండు మూడు రోజుల్లో ఈ విషయమై అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇదే కనుక నిజమైతే దీన్ని ఏ ఓటీటీకి అమ్ముతారో చూడాలి. అమెజాన్ ప్రైమ్ వీడియో వారే ఈ సినిమాను కొనే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఈ సినిమా ఒరిజినల్ వెర్షన్ ఆల్రేడీ అమెజాన్ లోనే స్ట్రీమింగ్ అవుతోంది. ఒకవేళ 'నారప్ప' ఓటీటీ విడుదలకు వెళ్తే, ఈ పద్ధతిలో సినిమాని రిలీజ్ చేసిన స్టార్ హీరోగా వెంకటేష్ నిలుస్తారు. మరి త్వరలోనే 'నారప్ప' విడుదలపై క్లారిటీ వస్తుందేమో చూడాలి.