Begin typing your search above and press return to search.

మోదీ బ‌యోపిక్ రిలీజ్ కొత్త తేదీ?

By:  Tupaki Desk   |   5 April 2019 8:10 AM GMT
మోదీ బ‌యోపిక్ రిలీజ్ కొత్త తేదీ?
X
ఎన్నిక‌ల ముంగిట బ‌యోపిక్ ల‌కు అడ్డంకులు త‌ప్ప‌డం లేదు. ఎల‌క్ష‌న్ క‌మీష‌న్ రిలీజ్ ల‌కు అంగీక‌రించ‌డం లేదు. ఓట‌ర్ల‌ను ప్ర‌భావితం చేసేలా రాజ‌కీయ నాయ‌కుల బ‌యోపిక్ లు తెర‌కెక్కించి రిలీజ్ చేస్తున్నార‌ని అపోజిష‌న్ వాళ్లు అభ్యంత‌రం వ్య‌క్తం చేయ‌డంపై స‌ర్వ‌త్రా ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. దేశ‌వ్యాప్తంగా అన్ని సినీప‌రిశ్ర‌మ‌ల్లో ఈ స‌న్నివేశం నెల‌కొంది. ఇటీవ‌లే వివాదాస్ప‌ద ఆర్జీవీ తెర‌కెక్కించిన `ల‌క్ష్మీస్ ఎన్టీఆర్` రిలీజ్ తేదీని ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో వాయిదా వేసిన సంగ‌తి తెలిసిందే. ఏపీ ఓట‌ర్ల‌ను ప్ర‌భావితం చేసే విధంగా ఈ సినిమాని తెర‌కెక్కించార‌ని అభ్యంత‌రాలు వ్య‌క్తం చేయ‌డంతో రిలీజ్ ని వాయిదా వేశారు.

ప్ర‌స్తుతం అదే స‌న్నివేశం `పీఎం న‌రేంద్ర మోదీ` బ‌యోపిక్ కి ఎదుర‌వుతోంది. ఈ సినిమా రిలీజ్ కి కాంగ్రెస్ వ‌ర్గాలు మోకాల‌డ్డుతూ ఈసీకి ఫిర్యాదు చేశాయి. సీబీఎఫ్‌సీ గ‌డ‌ప‌పై ఉండ‌గానే రిలీజ్ తేదీ విష‌యంలో బోలెడంత మెలోడ్రామా ర‌న్ అవుతోంది. ఇటీవ‌లే ఎల‌క్ష‌న్ క‌మీష‌న్ తీర్పు కోసం వివేక్ ఒబేరాయ్ ఎంతో ఉత్కంఠ‌గా వేచి చూశారు. అయితే ఈసీ నుంచి క్లీన్ చిట్ వ‌చ్చింది. రిలీజ్ విష‌యంలో అభ్యంత‌రాలు లేవ‌ని క్లియ‌రెన్స్ వ‌చ్చింది. అయితే అనంత‌రం సుప్రీం కోర్టులో అప్పీల్ కి వెళ్ల‌డంతో ఏప్రిల్ 5 న రిలీజ్ కావాల్సిన ఈ సినిమాని వాయిదా వేస్తున్నామ‌ని మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. ద‌ర్శ‌కుడు ఒమంగ్ కుమార్ సైతం ఏప్రిల్ 5న ఈ సినిమా రిలీజ్ కాదు. ఇప్ప‌టికి రిలీజ్ తేదీ ఇంకా స‌స్పెన్స్!!అంటూ ట్వీట్ చేశారు. దీంతో ఏప్రిల్ 5 న వ‌స్తుందా? రాదా? అన్న డైల‌మాకు తెర‌ప‌డింది.

ఏప్రిల్ 5న రిలీజ్ కాక‌పోతే త‌దుప‌రి ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు? కొత్త తేదీ ఏదైనా ఫిక్స్ చేశారా? అంటే గూగుల్ లో మెజారిటీ జ‌నం అభిప్రాయం ఒరిజిన‌ల్ తేదీ ఏప్రిల్ 12 న రిలీజ‌య్యేందుకు ఆస్కారం ఉంద‌ని చెబుతున్నారు. ఏప్రిల్ 8 న సుప్రీం కోర్టులో మోదీ బ‌యోపిక్ విష‌య‌మై తుది తీర్పు వెలువ‌డ‌నుంది. ఏప్రిల్ 12 (ఒరిజిన‌ల్ తేదీ)న రిలీజ్ కి ఆస్కారం ఉంటుంద‌ని మెజారిటీ జ‌నం అంచ‌నా వేస్తున్నారు. కొత్త రిలీజ్ తేదీని ఆరోజే ప్ర‌క‌టించే వీలుంద‌ని తెలుస్తోంది.