Begin typing your search above and press return to search.
అల్లరి తీసేసి యాంగ్రీ నరేష్ అంటారట..!
By: Tupaki Desk | 2 May 2023 10:19 AMఅల్లరి నరేష్ నటించిన ఉగ్రం సినిమా ఈవెంట్ తెలుగు ప్రేక్షకులు నరేష్ అభిమానుల సమక్షంలో గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్ కి డైరెక్టర్ హరీష్ శంకర్, అనీల్ రావిపుడితో పాటుగా యువ హీరోలు విశ్వక్ సేన్, నిఖిల్, సందీప్ కిషన్, అడివి శేష్ అటెండ్ అయ్యారు. నరేష్ తో తమకు ఉన్న అనుబంధం గురించి చెబుతూ సినిమాపై తమ అభిప్రాయాన్ని వెళ్లడించారు. ముందుగా విశ్వక్ సేన్ మాట్లడుతూ.. కొన్ని సినిమాలు ట్రైలర్ చూడగానే అరె మంచి సినిమా మిస్ అయ్యామా అనిపిస్తుంది. ఉగ్రం అలాంటి ట్రైలర్.. చూడగానే గూస్ బంప్స్ వచ్చాయని అన్నారు విశ్వక్ సేన్.
ట్రైలర్ ఒక్కసారి కాదు రిపీటెడ్ గా చూసినా సరే ఆ ఇంప్యాక్ట్ అలానే ఉంది. సినిమా కచ్చితంగా సక్సెస్ అవుతుందని అడ్వాన్స్ గా కంగ్రాట్స్ చెప్పారు విశ్వక్ సేన్. షైన్ స్క్రీన్ బ్యానర్ లో తన సినిమా లైన్ లో ఉందని.. అందుకే ఈ ప్రొడక్షన్ ఫ్యామిలీ మెంబర్ గా ఈ ఈవెంట్ కి వచ్చానని అన్నారు. ఇక నరేష్ గురించి మాట్లాడుతూ నరేష్ అన్న మాస్ ఇప్పుడు కాదు అరె కర్ణా చంపేద్దాం రా అన్నప్పుడే చూశాను.. ఒక సినిమా వస్తుంటే కొందరు వీడి సినిమా ఆడొద్దని అనుకుంటారు. కానీ నరేష్ అన్న సినిమాను అందరు ఓన్ చేసుకుంటారని అన్నాడు. తనకు మొదటి రోజు నుంచి బ్రదర్ లాంటి ఫీలింగ్ ఉంటుంది. సినిమా సక్సెస్ అవుతుందని ముందే కంగ్రాట్స్ చెబుతున్నానని అన్నారు విశ్వక్ సేన్.
ఇక సందీప్ కిషన్ మాట్లాడుతూ..మా అందరికీ మోస్ట్ ఫేవరెట్ సీనియర్ నరేష్ అన్న. మా అందరినీ చేరదీసి తోడుగా ఉన్నారు. నరేష్ అన్న మాస్ ఎప్పుడో చూశాను.. ఆయన ఇలాంటి పాత్రలు చేస్తే నాకు ఇష్టమని అన్నారు సందీప్ కిషన్. నరేష్ అన్న తన కంఫర్ట్ ని వదులుకుని ప్రేక్షకులు తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని ప్రూవ్ చేసుకోవాలని ఈ సినిమా చేశారు. 20 ఏళ్లుగా 60 సినిమాలు చేసిన నరేష్ అన్న మాస్ యాక్షన్ సినిమా చేయడం ఆయన హక్కు అని సందీప్ కిషన్ అన్నారు.
మరో యువ హీరో అడివి శేష్ మాట్లాడుతూ ఈవెంట్ కి పిలిచినందుకు నిర్మాతలకు థాంక్స్. విజయ్ కి అడ్వాన్స్ కంగ్రాట్స్. నాంది ప్రసాద్ లో చూసి ఎంజాయ్ చేశా.. మే 5న ఉగ్రం సక్సెస్ కొడతారని అన్నారు. మేజర్ కానే ఏ సినిమా అయినా నా కెరీర్ కి మూల కారణం అబ్బూరి రవి.. ఆయన మాటలు అందిస్తే వెనకాల గైడెన్స్ ఉంటాయి. మన టీం లో పనిచేసినట్టుగానే ఈ సినిమాకు అంతే కంఫర్ట్ గా పనిచేశానని ఆయన అన్నారు. ఇక వెల్కమ్ టు టాలీవుడ్ మిర్నా మేము మా హీరోయిన్స్ ని ఇష్టపడతామంటూ అడివి శేష్ అనడంతో ఆడిటోరియం అంతా ఆడియన్స్ గోల చేశారు.
ఇండియా రాకముందు యూఎస్ లో ఉన్నప్పుడు థియేటర్ లో గాలి శీను పాత్ర చూసి నరేష్ అనే యాక్టర్ ని ప్రేమించాను. నరేష్ యాంకర్ గా చాలా ఇష్టం. పెద్దగా పరిచయం లేకపోయినా నా కెరీర్ బిగినింగ్ లో నా ఆడియో రిలీజ్ కి మీరు వస్తే బాగుంటుంది అనుకున్నా కానీ ఇప్పుడు నేను మీ ఈవెంట్ కి వచ్చానని అన్నారు. 70,80 కాలంలో యాంగ్రీ యంగ్ మెన్ అమితాబ్ బచ్చన్ వచ్చారు. ఆయన సూపర్ స్టార్.. నాకు ఉగ్రం తర్వాత యాంగ్రీ నరేష్ అని నరేష్ ని పిలుస్తారని అనుకుంటున్నా అని అన్నారు. ఈ యూనిట్ అందరికీ కంగ్రాట్స్ అని చెప్పారు అడివి శేష్.
ఇక మరో టాలెంటెడ్ హీరో నిఖిల్ మాట్లాడుతూ.. ఉగ్రం ట్రైలర్ చూసి గూస్ బంప్స్ వచ్చాయి. ఈ సినిమా నిర్మాత సాహు గారపాటి నాకు స్నేహితుడే.. నరేష్ కూడా ఫ్రెండే.. కానీ ఈవెంట్ కి ఎవరు పిలవకపోయినా ట్రైలర్ చూసి వచ్చానని.. బ్లాక్ బస్టర్ సినిమా ఈవెంట్ లో భాగం అవడం కోసం వచ్చానని అన్నారు. ఉగ్రం లో కొత్త నరేష్ ని చూసారు. నరేష్ భాయ్ మరింత ఎత్తుకి వెళ్తారని అన్నారు నిఖిల్. విజయ్ గురించి చాలా వింటున్నా ఈ సినిమాటో బ్లాక్ బస్టర్ కొట్టాలని అనుకుంటున్నాను. సినిమా సక్సెస్ మీట్ కి తనని ఇన్వైట్ చేయాలని అప్పుడు ఇంకాస్త ఎక్కువ మాట్లాడతానని అన్నారు నిఖిల్.