Begin typing your search above and press return to search.
నాగబాబుపై శివాజీరాజా వ్యాఖ్యలపై ఆ ఇద్దరూ సీరియస్!
By: Tupaki Desk | 4 May 2019 4:53 AM GMTమా ఎన్నికల సందర్భంగా మొదలైన రచ్చ ఇంకా ఒక కొలిక్కి రాకపోవటం తెలిసిందే. ఒకరిపై ఒకరు విమర్శలు.. ఆరోపణలు చేసుకోవటం తెలిసిందే. ఓడిన ప్యానల్ కు చెందిన శివాజీరాజా ఈ మధ్యన మీడియాతో మాట్లాడుతూ నాగబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేయటం సంచలనంగా మారింది. కాస్త ఆలస్యంగా శివాజీరాజా వ్యాఖ్యలపై స్పందించిన మా అధ్యక్ష కార్యదర్శులు.. ఊహించనిరీతిలో షాకింగ్ వ్యాఖ్యలు చేశారు.
మీడియా ముందుకు వచ్చి శివాజీరాజా నటుడు నాగబాబుపై చేసిన వ్యాఖ్యల్ని తామిద్దరం ఖండిస్తున్నట్లు నరేశ్.. రాజశేఖర్.. జీవితలు ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆరోగ్యకరమైన వాతావరణంలో రెండేళ్లు పని చేయాలని తాము అనుకుంటున్నామని.. తాము చెప్పిన వాటిల్లో ఇప్పటికే కొన్ని పనులు చేపట్టినట్లు వెల్లడించారు.
పింఛన్ ను రూ.5వేల నుంచి రూ.6వేలకు పెంచామని.. త్వరగా పనులు చేస్తున్నట్లు చెప్పారు. తమకు తెలంగాణ ప్రభుత్వ మద్దతు ఉందని.. ఏపీలో కొత్తగా కొలువు తీరే ప్రభుత్వ మద్దతును కోరతామన్నారు.
మా అన్నది ఒక కుటుంబమని.. ఏదైనా కూర్చొని మాట్లాడుకోవాలే కానీ.. మీడియా దగ్గరకు వెళ్లి మాట్లాడటం సరికాదన్నారు. అనవసరమైన వ్యాఖ్యలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తాము అనుకుంటున్నట్లు మా అధ్యక్ష కార్యదర్శకలు స్పష్టం చేయటం గమనార్హం.
నాగబాబుపై శివాజీరాజా చేసిన వ్యాఖ్యలపై మా అధ్యక్షుడిగా కాకుండా ఒక నటుడిగా మాట్లాడుతున్నానంటూ నరేశ్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. మొన్న శివాజీరాజా చేసిన వ్యాఖ్యలు నన్ను బాధించాయి. నాగబాబు.. శివాజీ.. ఇద్దరూ మా మాజీ అధ్యక్షులు. వ్యక్తిగతంగా కామెంట్లు చేయటం తగదు.
నాగబాబు నడవలేకపోతున్నారంటూ వ్యాఖ్యలు చేయటం వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టటమే. మా అధ్యక్షుడిగా నాగబాబు 600 మందికి ఏమీ చేయలేకపోయారని.. ఇప్పుడేం చేస్తారని శివాజీ అన్నారని.. అలాంటి వ్యాఖ్యలు సరికావన్నారు. నాగబాబు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు చెప్పారు.
మాకు సంబంధించిన విషయాల్ని పబ్లిక్ లోకి తీసుకురావొద్దని తాను కోరుతున్నానని.. నాగబాబు కుటుంబం రూ.6లక్షల మొత్తాన్ని మాకు ఇచ్చిన వైనాన్ని నరేశ్ గుర్తు చేశారు. నాగబాబుపై శివాజీ చేసిన వ్యాఖ్యల్ని తప్పు పట్టిన నరేశ్ ను తాము పూర్తిగా సమర్థిస్తున్నట్లు జీవిత పేర్కొన్నారు. గతం గురించి తవ్వుకోవద్దని అనుకున్నామని.. ఒకరిపై ఒకరు మాట్లాడుకోవద్దని అనుకున్నామని.. ఇలాంటి తీరు సరికాదన్నారు. తప్పులు అందరూ చేస్తారని.. వాటిని సరిచేసుకుంటామన్న ఆమె.. ఎదుటివారి గురించి చెడుగా చెప్పటం ఆపేద్దామన్నారు. లోపాలు ఏమైనా ఉంటే.. మనలో మనం మాట్లాడుకుందామని చెప్పేందుకే ఇలా బయటకు వచ్చి మాట్లాడుతున్నట్లుగా జీవిత చెప్పారు. కూర్చొని మాట్లాడుకుందామని చెబుతూనే.. మీడియా ముందుకొచ్చి చేసిన తాజా వ్యాఖ్యలకు శివాజీరాజా ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.