Begin typing your search above and press return to search.
మొత్తానికి నాగబాబు రంగంలోకి దిగి చెలరేగారు!
By: Tupaki Desk | 6 Oct 2021 2:52 PM GMT`మా` ఎన్నికల సమరం కొత్త మలుపులు తిరుగుతోంది. రోజుకో టర్న్ తీసుకుంటూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. గత కొన్ని రోజులుగా సైలెంట్ గా వున్న మెగా బ్రదర్ నాగబాబు తాజాగా బుధవారం రంగంలోకి దిగారు. `మా` ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న మంచు విష్ణుతో పాటు అతనికి అండగా నిలిచి విమర్శలు చేస్తున్న నటుడు నరేష్ పై సెటైర్లు వేశారు. బుధవారం నాగబాబు ప్రకాష్ రాజ్ ప్యానెల్ కు మద్దతుగా మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా గత కొన్ని రోజులుగా ప్రకాష్ రాజ్ ప్యానెల్ తో పాటు పవన్ కల్యాణ్ ని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్న వారిపై సుతిమెత్తంగా సెటైర్లు వేశారు.
ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ ``మా` అనేది ఒక చిన్న సంస్థ కానీ కేవలం ఒక వ్యక్తి కారణంగా `మా` ఎన్నికలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. మనలో చాలా మందికి అతను ఎవరో తెలుసు కాబట్టి నేను పేరు చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి చిన్న సమస్యకు అతను `మా` సమావేశం ఏర్పాటు చేయకుండా ప్రెస్ ని పిలుస్తున్నాడు. అతని వల్ల చాలా మంది `మా` సభ్యులు మీడియా ముందుకు వస్తున్నారు. అనవసరమైన వివాదాలు సృష్టిస్తున్నారు. నరేష్ నాకు మంచి మిత్రుడు కానీ అతని వల్ల అనవసర వివాదాల జోలికి వెళ్లాలనుకోవడం నాకు ఇష్టం లేదు.
ఇక ప్రకాష్‌రాజ్ గురించి మాట్లాడుతూ ` ప్రకాష్ రాజ్ నా సోదరుడు చిరంజీవికి సన్నిహితుడు. ఎవరైనా అన్నయ్యతో అనుబంధం కలిగివుంటే మేము కూడా అతన్ని అదే విధంగా భావిస్తాము. మా మద్య విభేదాలున్నాయి అది వేరే విషయం. `మా` ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ పోటీపడుతున్నాడని తెలిసినప్పుడు `నేను ఎవరికైనా మాట ఇచ్చానా? అని అడిగారు. దానికి లేదు అని చెప్పాను. దానికి అన్నయ్య ప్రకాష్ రాజ్ అయితే బాగుంటుంది. ఎందుకంటే అతను అరుదైన మేధస్సు.. మంచి మనసున్న వ్యక్తి ` అని అన్నయ్య అన్నారు.
ప్రకాష్ రాజ్ గురించి నాగబాబు మాట్లాడుతూ ఆయన చూడటానికి సింపుల్ గా కనిపించవచ్చు కానీ ఆయన ఒక యాక్టివిస్ట్. ఇందులో తమాషా ఏంటంటే నేను బీజేపీ సానుభూతిపరుడిని కానీ ప్రకాష్ రాజ్ కమ్యూనిస్ట్ భావాలున్న వ్యక్తి. ఇండియా టుడూ కాన్ క్లేవ్ లో బిజేపి నేత సుబ్రహ్మణ్యస్వామితో చర్చించిన తీరు నాకు బాగా నచ్చింది. ఒక నటుడు రాజకీయ నాయకుడితో చర్చకు వెళ్లడం అంత సులభం కాదు. అది కూడా సుబ్రహ్మణ్య స్వామి వంటి కఠినమైన రాజకీయ నాయకుడు మరియు బారతీయ రాజకీయాలపై అపారమైన అనుభవం ఉన్న వ్యక్తితో చర్చకు వెళ్లడం అంత సులభం కాదు అని ఈ సందర్భంగా తెలిపారు నాగబాబు.
ఇక మంచు విష్ణు .. పవన్ కల్యాణ్ ని ఉద్దేశించి మాట్లాడిన మాటల్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ప్రకాష్ రాజ్ నువ్వు ఇండస్ట్రీ వైపు వుంటావా? లేక పవన్ కల్యాణ్ వైపు వుంటావా? అని ఛాలెంజ్ చేశాడు. ఇదేంటీ ఈ ప్రశ్నేంటి విష్ణు. ప్రకాష్ రాజ్ మరో రాష్ట్రం వాడు కాబట్టి అన్నాడేమో అనుకోవచ్చు.. కల్యాణ్ బాబు తెలుగు వాడు కాదా? తనది తెలుగు ఇండస్ట్రీ కాదా? .. ఏం ఆలోచిస్తున్నారో.. ఎట్లాంటి ఫీడ్ బ్యాక్ ఇస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. నేను ప్రకాష్ రాజ్ కి మద్దతు ఇస్తే ఎప్పుడో జరిగిన మా అసోసియేషన్ బిల్డింగ్ గురించి మాట్లాడుతున్నారు. ఎన్నిసార్లు ఎత్తుతార్రా నాయనా..?
`మా` అసోసియేషన్ కి 170 గజాల స్థలం వుంది. అక్కడే డైరెక్టర్స్ అసోసియేషన్ కూడా వుంది. మేము కొన్నప్పుడు ఆ స్థలానికి 90 లక్షలు అయింది. అయితే దాన్ని శివాజీ రాజా వాళ్లు అమ్మేశారు. దానికి నరేష్ దగ్గరి నుంచి ఆన్సర్ లేదు. ఎందుకంటే దానికి సంతకం పెట్టింది అప్పట్లో నరేషే. దీని గురించి మోహన్ బాబు అన్నయ్య నన్ను అడిగాడు.. నన్ను అడగడం ఎందుకు మీకు కృష్ణుడిలా (నరేష్) కాపలా కాస్తున్నాడు కదా అతన్నే అడగొచ్చుగా...? తాజాగా ఓ మాట విన్నాను. ఆర్టిస్ట్ లకు మొట్టమొదటి సారి డబ్బు ఆశ చూపుతున్నారని తెలిసింది. అది ఎంత వరకు నిజమో నాకు తెలియదు. ఇప్పటికే అందరికి పదివేలు ఇచ్చాం.. త్వరలో మరో కొంత ఇవ్వబోతున్నాం.. అని మాట్లాడుతున్నారట. `మా` అసోసియేషన్ మసకబారుతోందని అప్పట్లో ఎందుకో అన్నాను.. ఇప్పుడు చెబుతున్నాను `మా` మసకబారబోతోంది` అని నాగబాబు ఘాటుగా స్పందించారు.