Begin typing your search above and press return to search.
అమ్మ బయోపిక్.. అంతా పుకారేనని స్పష్టం చేసిన తనయుడు...!
By: Tupaki Desk | 28 April 2020 9:50 AM GMTసీనియర్ నటి, దర్శకురాలు, గిన్నిస్ బుక్ రికార్డ్ హోల్డర్ విజయ్ నిర్మల అనారోగ్యంతో గత ఏడాదిలో కన్నుమూసిన సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా విజయ నిర్మల జీవితం ఆధారంగా బయోపిక్ రాబోతున్నట్లు ఊహాగానాలు వస్తున్నాయి. అంతేకాకుండా మహానటి సావిత్రి బయోపిక్ లో నటించిన హీరోయిన్ కీర్తి సురేష్ ఈ బయోపిక్ టైటిల్ పాత్రలో నటించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ బయోపిక్ వార్తలను విజయ్ నిర్మల తనయుడు, నటుడు సీనియర్ నరేశ్ ఖండించారు. విజయ నిర్మల బయోపిక్ ను ఇప్పుడు రూపొందించడం లేదని.. ఆమె బయోపిక్ కోసం ఎవరికీ పర్మిషన్స్ ఇవ్వలేదని ఆయన చెప్పేశారు. అయితే గత రెండు సంవత్సరాలుగా విజయ నిర్మల జీవిత చరిత్ర స్క్రిప్ట్ మీద తనే వర్క్ చేస్తున్నట్లు వెల్లడించాడు.
'కొన్ని ఏళ్ళ క్రితం మా అమ్మ విజయ నిర్మల తన జీవిత కథ యొక్క స్క్రిప్ట్ రాయమని నన్ను కోరింది.. నేను కొంతకాలం ఆ స్క్రిప్ట్ మీద పనిచేశాను.. కానీ ఆమె ఆరోగ్య పరిస్థితి క్షీణించిన తరువాత ఆ స్క్రిప్ట్ పనులు నిలిపివేయబడ్డాయి. అయినా నేను ప్రస్తుతం ఆ స్క్రిప్ట్ కోసం పని చేస్తున్నాను.. విజయ నిర్మల జీవిత కథ తెరపైకి రావాలంటే చాలా లోతుగా పరిశోధన చేయవలసిన అవసరం ఉంది. దీనిపై ఇప్పుడే మాట్లాడితే చాలా ముందుగా మాట్లాడినట్లుంది. ఈ స్క్రిప్ట్ పూర్తి చేయడానికి ఇంకా కొన్ని సంవత్సరాల సమయం పడుతుందని' నరేష్ చెప్పుకొచ్చారు. దీంతో విజయ్ నిర్మల బయోపిక్ పై వస్తున్న వార్తలకు చెక్ పడింది అని చెప్పవచ్చు. విజయ నిర్మల వందకు పైగా చిత్రాల్లో నటించడమే కాకుండా యాభై చిత్రాలకు దర్శకత్వం వహించింది. అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన మహిళా దర్శకురాలిగా గిన్నిస్ రికార్డ్ సొంతం చేసుకుంది. ఇదిలా ఉండగా దివంగత దర్శకురాలు విజయనిర్మల కాంస్య విగ్రహాన్ని హైదరాబాద్ లోని నానక్ రామ్ గూడలో ఉన్న ఆమె నివాసంలో ఆవిష్కరించిన విషయం తెలిసిందే.