Begin typing your search above and press return to search.
పవన్ ఓటమి.. నరేష్ ఆసక్తికర వ్యాఖ్యలు
By: Tupaki Desk | 30 May 2019 5:39 AM GMTజనసేనాని పవన్ కళ్యాణ్ ఎన్నో ఆశలతో ఏపీ ఎన్నికల బరిలో నిలిచాడు. డబ్బులు ఖర్చు పెట్టకుండా క్లీన్ పాలిటిక్స్ అంటూ ముందుకు వచ్చాడు. కానీ వైసీపీ ప్రభంజనంలో కొట్టుకుపోయాడు. రెండు చోట్ల పోటీచేసినా ఆయన గెలువలేకపోయారు. ఒక్క స్థానంలోనే ఆయన పార్టీ అభ్యర్థి గెలిచారు. జనసేన ఇంత దారుణ ఓటమిపై అటు సినిమా ఇండస్ట్రీలోనూ.. ఇటు విశ్లేషకుల లోనూ ఆవేదన వ్యక్తమైంది. అయితే ఏపీలో జనసేన ఏడు శాతానికి పైగా ఓట్లు రాబట్టుకోవడం ఒక్కటే ఆ పార్టీకి ఊరటనిచ్చే విషయం..
అయితే టీడీపీ, వైసీపీల్లా డబ్బు ఖర్చు పెట్టకుండా జనసేన అధిపతి పవన్ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారని ఆ పార్టీ నేతలు సర్దిచెప్పుకుంటున్నారు. తాజాగా జనసేన ఓటమి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు నరేష్ ఓ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను రాజకీయాలకు అతీతంగా పవన్ ను అభిమానించానని.. ఆయన గెలుస్తాడని అనుకున్నానని తెలిపారు. పవన్ డబ్బు పంచకుండా పోటీచేస్తానని అన్నాడని.. చేసి చూపించాడని.. గెలిచాడా.? లేదా అనే విషయం పక్కనపెడితే మార్పుకి నాంది పలికాడని అన్నాడు.
అందుకే ఓడినా కానీ తనకు పవన్ కళ్యాణ్ పై ఇష్టం పెరిగిందని.. త్వరలోనే వెళ్లి కలుస్తానని తెలిపాడు. డబ్బులేకుండా ఎన్నికల్లో పోటీచేస్తానని చెప్పిన జయప్రకాష్ నారాయణ్ లాంటి శక్తులు కలిసిరావాలని నరేష్ అన్నారు. డబ్బులకు అతీతంగా రాజకీయాలు చేసే రోజు వచ్చినప్పుడే దేశం బాగుపడుతుందని.. రాజకీయాల్లో వంద కోట్ల ఖర్చు పెట్టిన నేతలు నాలుగైదు రెట్లు దానికి ప్రతిగా రాబడుతారని.. ఈ లోగా జైలుకు వెళతారని స్పష్టం చేశారు. అందుకే పవన్ లాంటి నేతల గెలుపు దేశానికి అవసరం అని అన్నారు.