Begin typing your search above and press return to search.
క్రిమినల్ కేసులున్న వ్యక్తి అధ్యక్షుడా?!- నరేష్
By: Tupaki Desk | 5 Oct 2021 6:51 AM GMT`మా` ఎన్నికల వేడి అంతకంతకు రాజుకుంటోంది. అప్పుడప్పుడు ప్రచారం కాస్త గతి తప్పుతోంది. అదుపు తప్పి క్రిమినల్ కేసుల బాట పడుతోంది. పోటీ చేస్తున్న వ్యక్తి గెలుపు అనివార్యం అని తెలిసినా కొద్దీ ప్రకాష్ రాజ్ పై `మా` మాజీ అధ్యక్షుడు నరేష్.. ప్రస్తుతం అధ్యక్ష పదవి కోసం పోటీపడుతున్న మంచు విష్ణు సంచలన ఆరోపణలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. రోజు రోజుకీ ఎన్నికల తేదీ దగ్గరపడుతున్నా కొద్దీ `మా` ఎన్నికలు కొత్త రంగుని పులుముకుంటున్నాయి.
ఆరోపణలు .. ప్రత్యారోపణల పర్వం కాస్తా క్రిమినల్ కేసులని వెలికి తీయడం.. వెతికి పట్టుకోవడం దాకా దిగజారడం చూస్తున్న వారికి వెగటు పుట్టిస్తోంది. తాజాగా ఓ మీడియా ఛానల్ లైవ్ లో `మా` మాజీ అధ్యక్షుడు నరేష్.. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ పై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. నేర చరిత్ర వున్న నటుడు అధ్యక్షుడిగా పోటీ చేయడం ఏంటీ అని నరేష్ తాజాగా కొత్త వాదనని తెరపైకి తీసుకొచ్చారు. ప్రకాష్ రాజ్ తాను అధ్యక్ష పదవికి పోటీపడుతున్నానని ప్రకటించగానే స్థానిక కళాకారుడు కాదని.. అతనికి `మా`లో అధ్యక్ష పదవికి పోటీ చేసే అర్హత లేదంటూ వివాదం స్టార్ట్ చేసిన నరేష్ తాజాగా కొత్త వాదనకు తెరలేపడం పలు అనుమానాలకు తావిస్తోంది.
అశోక్ తివారీ అనే వ్యక్తి తనకు ప్రకాష్ రాజ్ కోట్లు ఎగవేశాడని అతనిపై క్రిమినల్ కేసు పెట్టాడు. అంతే కాకుండా మరో వ్యక్తి మరో ఆరోపణ చేశాడు. ఇలాంటి క్రిమినల్ రికార్డు వున్న ప్రకాష్ రాజ్ `మా`కు అధ్యక్షుడైతే `మా` మసక బారడం కాదు చీకటి అయిపోతుంది`అంటూ నరేష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతని సంతరించుకుంది. ఇక టీవీ ఛానల్ లైవ్ లో నరేష్ మాట్లాడిన తీరు చాలా మందికి నవ్వు తెప్పిస్తోంది. ``కులాల సమీకరణ గురించి యాంకర్ అడిగిన ప్రశ్నకు `మా` కులాలు ఏంటో మాకు ఇప్పటికీ తెలియదని`` చెప్పడం పలువురిని ఆశ్చర్యానికి గురి చేసింది. అంతా నవ్వుకునేలా చేసింది.