Begin typing your search above and press return to search.

ఎక్స్ క్లూసివ్ : ఎన్ని వచ్చినా సినిమా ఆగదు...!

By:  Tupaki Desk   |   7 Aug 2020 1:30 PM GMT
ఎక్స్ క్లూసివ్ : ఎన్ని వచ్చినా సినిమా ఆగదు...!
X
* హాయ్ బాబ్జి గారు ఎలా ఉన్నారు?

(నవ్వులు) లైవ్ క్యారెక్టర్ అండి ఇది(ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య సినిమాలో నరేష్ యాక్ట్ చేసిన పాత్ర పేరు బాబ్జి). థాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ రెస్పాన్స్ అండి. మీరు నన్ను నరేష్ అని నా పేరు తో కాకుండా నేను పోషించిన పాత్ర పేరుతో పిలవడం కంటే మంచి ప్రశంస - ఆదరణ ఏముంటుంది చెప్పండి.

* బాబ్జి పాత్ర ఎలా మీ దగ్గరకు చేరింది?

ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య దర్శకుడు - ఈ సినిమాను తెలుగు తగ్గట్లుగా మార్చే క్రమంలో ఈ బాబ్జి రోల్ నాకు ఐతేనే బాగుంటుంది అని అనుకున్నారట - నేను కూడా ఈ సినిమా కథ నా పాత్ర వైవిధ్యంగా ఉండటంతో నటించడానికి ఒప్పుకున్నాను - మీరు గమనిస్తే నా కెరీర్ లో నేను ఎక్కువగా ఈ తరహా పాత్రలు పోషించడానికే మొగ్గు చూపించాను. సమ్మోహనం - శతమానం భవతి - గుంటూరు టాకీస్ ఇలా చాలా ఉన్నాయి. ఇప్పుడు వస్తున్న కొత్త దర్శకులు సైతం నన్ను దృష్టిలో పెట్టుకొని ఇలాంటి పాత్రలు రాస్తున్నారు. కాలానికి అనుగుణంగా నన్ను నేను మార్చుకుంటూ ప్రస్తుత తరానికి అందుబాటులో ఉంటున్నా కాబట్టే నాకు ఎప్పుడు 7 నుంచి 8 సినిమాలు వరసలో ఉంటున్నాయి - బాబ్జి లాంటి పాత్రలు వస్తున్నాయి. ఇదంతా నా ఒక్కడి శ్రమ వల్లే జరిగింది అని కూడా నేను చెప్పదలుచుకోను - నన్ను ప్రోత్సహిస్తూ నాకు అవకాశాలు ఇస్తున్న రైటర్స్ - డైరెక్టర్స్ - ప్రొడ్యూసర్స్ సమిష్ట కృషి.

* ఇండస్ట్రీ లో అనుభవం ఉన్న యాక్టర్ గా డిప్రెషన్ గురించి మీ జూనియర్స్ కి మీరు ఇచ్చే సలహా ఏంటి?

సుశాంత్ సింగ్ రాజ్ పుట్ మరణం నన్ను బాధించింది. నా 50 ఏళ్ళ సినీ జీవితంలో కొన్నాళ్లు పాటు నేను ఇండస్ట్రీకి దూరంగా ఉన్నాను - ఆ టైం లో నేను కొంత లో గా ఫీల్ అయిన సందర్భాలు ఉన్నాయి. కానీ నన్ను నేను మలుచుకుంటూ - అవమానాలు తట్టుకుంటూ మళ్ళీ ఇండస్ట్రీలో పుంజుకున్నాను. కానీ నేటి జనరేషన్ ఇలా లేదు, ఎక్కువగా ఫాల్స్ ప్రేస్టిజ్ లకు పోతున్నారు. కెర్రిర్ ఇంకా సెట్ అవ్వకుండానే లగ్జరీ జీవితాలకి అలవాటు పడిపోతున్నారు. ఇండస్ట్రీ లో ఇది మరి ఎక్కువగా కనిపిస్తుంది. నేను చెప్పేది ఒక్కటే మన మాట తీరు - మన నడవడికే ఇండస్ట్రీ లో మనల్ని పది కాలాలు పాటు ఉండేలా చేస్తుంది. ఇక్కడ టాలెంట్ కంటే పాజిటివ్ ఆటిట్యూడ్ చాలా ముఖ్యం. అవకాశలు రాలేదనో - రావేమో అని బయపడి ప్రాణాలు మీదకి తెచ్చుకునే కంటే ముందుగానే అందరితో సఖ్యతగా ఉంటే సమస్యలు రావు - ఇలాంటి డిప్రెషన్ భారిన పడకుండా ఉండచ్చు.

* మీరు కూడా ముక్కు సూటిగానే ఉంటారుగా - సమస్యలు రావడంలేదా?

ఆత్మాభిమానం వేరు అహంకారం వేరు - నేను అందరితో బాగుంటా - అందరిని గౌరవంగా చూస్కుంటా - కానీ నేను గీసుకున్న హద్దు దాటి వస్తే వాళ్లు ఎవరైనా సరే సరైన రీతిన సమాధానం చెబుతా. ఇలా ఉంటే మనం ఎవరికి చెడుకాము మనల్ని ఎవరు చెడ్డ అనరు. ముందు మనం అవతల వాళ్ళ వైపు నుంచి ఆలోచించడం మొదలు పెడితే అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుంతుంది అని నేను బలంగా నమ్ముతాను.

* బాగున్న సినిమాను జనాలు ఎలాగైనా చూస్తారు - కానీ ఓటిటి పై ఇండీస్ట్రీ లో భిన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి - దీని పై మీ స్పందన ఏంటి?

50 ఏళ్ళ సినీ అనుభవం ఉన్న నటుడిగా చెబుతున్న థియేటర్స్ కి ఓటిటి ల వల్ల ఎలాంటి నష్టం జరగదు. దేని దారి దానిదే - నిజానికి ఓటిటిలు రాక చిన్న బడ్జెట్ సినిమాలకు పెద్ద ప్లాట్ ఫారం మాదిరిగా పనిచేస్తుంది, అలానే థియేటర్స్ మీద కూడా ప్రెషర్ తగ్గుతుంది. ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య సినిమా ఓటిటి లో రిలీజ్ అవుతుంది అంటే నేను కూడా చాలా షాక్ తిన్న కానీ ఇప్పుడు మాకు వచ్చిన రెస్పాన్స్ చూసి షాక్ అవుతున్న. ఐతే ఒక్కటి మాత్రం నిజం - థియేటర్స్ నుంచి వచ్చేంత రెవెన్యూ ఓటిటిల వల్ల రాదు. కానీ జనాలు ఓటిటి లో సినిమాలు చూస్తారు - అలానే థియేటర్ కి వెళ్లి పాప్ కార్న్ తింటూ ఆ ఎక్స్ పీరియన్స్ ని కూడా ఎంజాయ్ చేస్తారు. ఎన్ని వచ్చినా మూవీ విల్ డోంట్ డై అనేది నా సింగల్ ఆన్సర్.

* మీకు ఓపిక ఉన్నంత వరకు తెలుగు ఆడియన్స్ ని ఇలానే ఎంటర్ టైన్ చేయాలి అని మా తుపాకీ టీం మనస్ఫూర్తిగా కోరుకుంటుంది - థాంక్ యూ ఆల్ ది బెస్ట్

మీ తుపాకీ సైట్ లో ఆర్టికల్స్ మాదిరిగానే ఈ ఇంటర్వ్యూ కూడా చాలా లోతుగా సాగింది - వెరీ హ్యాపీ టూ స్పీక్ విత్ యూ - అలానే తుపాకీ డాట్ కామ్ రీడర్స్ అందరు అవసరం ఉంటేనే బయటకు రండి - స్టే సేఫ్ ఆల్ ది బెస్ట్...