Begin typing your search above and press return to search.

నా డాక్టరేట్ వారికి అంకితం -నరేష్

By:  Tupaki Desk   |   7 March 2016 4:59 AM GMT
నా డాక్టరేట్ వారికి అంకితం -నరేష్
X
డాక్టరేట్ అవార్డ్ అందరికీ లభించేంది కాదు. ఏదైనా రంగంలో చేసిన అపార కృషికి, వారు చేసిన సేవలకు లభించే గుర్తింపే గౌరవ డాక్టరేట్. ఇప్పుడు సీనియర్ నటుడు నరేష్ ఈ పురస్కారం అందుకున్నారు. అకాడమీ ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ సంస్థ నరేష్ కు గౌరవ డాక్టరేట్ ను అందించింది.

'నా ఏడో ఏట నుంచి నటనా రంగంలో ఉన్నాను. ఇప్పటికి 150కి పైగా సినిమాలు చేశాను. నా నట ప్రస్థానాన్ని గుర్తించి న్యూయార్క్ యూనివర్సిటీ ఈ డాక్టరేట్ ప్రకటించింది. నాకు దక్కిన ఈ గౌరవం.. నా గురువులు జంధ్యాల గారు - విజయనిర్మల గారు - కృష్ణగారికి అంకింతమిస్తున్నా' అన్నారు నరేష్. తానెప్పుడు బిరుదులు - అవార్డుల కోసం పాకులాడలేదని అన్న నరేష్.. అవే తన వెంట రావడం ఆనందంగా ఉందని చెప్పారు. తాజాగా ఈయనకు నవరసరాయ అనే అవార్డు కూడా అందుకోవడం విశేషం.

డాక్టరేట్ అందుకున్నాక నటుడిగా, పౌరుడిగా బాధ్యత పెరిందన్న నరేష్.. ఈ ఏడాది తన సినీ కెరీర్ మర్చిపోలేనని అంటున్నారు. నేను శైలజ హిట్ తో ప్రారంభించి.. గరం - గుంటూరు టాకీస్ ఇలా వరుసగా మూవీస్ చేస్తున్నట్లు చెప్పారు. గుంటూరు టాకీస్ లో పాత్ర నటుడిగా పది మెట్లు ఎక్కించిందన్న ఈయన.. త్వరలో విడుదల కానున్న శ్రీశ్రీ - బ్రహ్మోత్సవం - అ..ఆ.. చిత్రాల్లో చేసిన పాత్రలు మంచి గుర్తింపు తెస్తాయని ఆశిస్తున్నట్లు చెప్పారు.