Begin typing your search above and press return to search.

మాజీ భార్య ఇప్పటికీ ఫ్రెండ్

By:  Tupaki Desk   |   5 April 2016 7:30 AM GMT
మాజీ భార్య ఇప్పటికీ ఫ్రెండ్
X
సీనియర్ నటుడు నరేష్.. ఇప్పుడు తన కెరీర్ లో బెస్ట్ అనదగ్గ స్థాయిలో ఉన్నాడని చెప్పచ్చు. కొన్నేళ్లు ఇండస్ట్రీకి దూరమైనా.. ఇప్పుడు అనేక విభిన్నమైన పాత్రలు నరేష్ కు వస్తున్నాయి. అయితే ఆఫర్స్ చాలానే ఉన్నా.. నటుడిగా తనను శాటిస్ఫై చేసే రోల్స్ ని మాత్రమే అంగీకరిస్తానంటున్నాడు నరేష్. అందుకే పెద్ద, చిన్న సినిమాలు అనే తేడాలు లేకుండా.. కేవలం తన కేరక్టర్ కే ప్రాధాన్యతనిస్తానని చెప్పాడు నరేష్.

రీసెంట్ గా వచ్చిన గుంటూరు టాకీస్ లో నరేష్ పోషించిన దొంగ పాత్ర బాగా క్లిక్ అయింది. నరేష్ కి మంచి పేరు, గుర్తింపు తెచ్చిపెట్టింది. త్వరలో రానున్న సూపర్ స్టార్ మహేష్ బాబు బ్రహ్మోత్సవంలోనూ నరేష్ కీలక పాత్ర పోషిస్తున్నాడు, త్రివిక్రమ్ మూవీ అ..ఆ.., వీరుట పోట్ల తీస్తున్న చిత్రంతో పాటు మరికొన్ని తెలుగు - తమిళ్ ప్రాజెక్టులకు సైన్ చేశాడు నరేష్.

ఇప్పుడీ స్థితికి చేరుకున్న కొన్నేళ్ల క్రితం నరేష్ పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయాడు. తన వ్యక్తిగత ఇంట్రెస్ట్ తో రాజకీయాల్లో అడుగుపెట్టడం, చాలా డబ్బును పోగొట్టుకోవడంతో.. చివరకు విడాకులు కూడా తీసుకోవాల్సి వచ్చింది. ఆ సమయం అమ్మ విజయనిర్మల అండగా నిలిచిందని చెబుతున్నాడు నరేష్. అయితే.. ప్రస్తుత భార్య అనుమతితో.. మాజీ భార్యతో స్నేహం కొనసాగిస్తున్నట్లు చెప్పాడు నరేష్. మాజీ భార్య రేఖ్ ఆటిజంపై చేస్తున్న ఓ ప్రాజెక్టులో తానూ సహాయం అందిస్తున్నట్లు నరేష్ చెప్పాడు.