Begin typing your search above and press return to search.
నరేశ్ - పవిత్ర పెళ్లి... ఇది కూడా సినిమా స్టంటేనా?
By: Tupaki Desk | 10 March 2023 12:11 PM GMTసీనియర్ నటుడు నరేశ్ - పవిత్ర వ్యవహారం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గత కొంత కాలంగా జరుగుతున్న ప్రచారాన్ని నిజం చేస్తూ.. నరేశ్ మరోసారి వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. తన స్నేహితురాలు పవిత్రా లోకేశ్‌ను వివాహం చేసుకున్నట్లు ఆయన ట్వీట్ చేశారు. ఒక పవిత్ర బంధం రెండు మనసులు, మూడు ముడులు, ఏడు అడుగులు మీ ఆశీస్సులు కోరుకుంటూ పవిత్ర నరేష్ అంటూ.. ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.
అయితే తెలుగులో రాసిన పదాల్లో మొదట బూతులు వచ్చాయి. దానితో వెంటనే డిలీట్ చేసి... మళ్లీ ఆయన ట్వీట్ పెట్టారు. ఆ ట్వీట్‌లో ఓ వీడియో కూడా ఉండగా.. అందులో నరేశ్ పవిత్ర వివాహం చేసుకున్నట్లు కనిపిస్తుంది. నరేష్ ఏడు అడుగులు వేసి... ఆమె మెడలో దండలు వేశాడు. ఇక బ్యాక్ గ్రౌండ్‌లో కొంత మంది వ్యక్తులు ఉన్నారు. అయితే వారంతా సినిమా పరిశ్రమలో జూనియర్ ఆర్టిస్టులు అని సమాచారం. ఇందులో నిజమెంతో తెలియదు.
అయితే ఇది నిజంగా జరిగిన వివాహమా..? లేదా ఏదైనా సినిమా కోసమా.. లేదా వెబ్ సిరీస్ కోసమా అనేది తెలియదు. ఇది ప్రమోషన్ స్టంట్ అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. వీరి వ్యవహారం గత కొంత కాలంగా వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రేజ్ వాడుకునేందుకు ఒక ప్రాజెక్ట్ సెట్ చేసుకున్నట్లుగా ప్రచారం అయితే జరుగుతుంది. ఇక నరేశ్ మూడో భార్య రమ్య రఘుపతి ఇంకా విడాకులు ఇవ్వలేదు. అయితే ఇదంతా ఏదైనా సినిమానో లేక వెబ్ సిరీస్ కు సంబంధించిన ప్రమోషన్ స్టంట్ అయి ఉంటుందని ప్రచారం కూడా జరుగుతోంది.
ఇక డిసెంబర్ 31వ తేదీన తాము కొత్త అడుగులు వేస్తున్నామని చెబుతూ పవిత్ర, నరేష్ లిప్ లాక్ ఇస్తున్న వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ విషయం అప్పట్లో తెగ వైరల్ అయింది. ఇప్పుడు మరోసారి ఈ జంట సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారారు. ఇందులో ఎంత నిజం ఉందనేది ప్రస్తుతానికి అయితే క్లారిటీ లేదు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.