Begin typing your search above and press return to search.
నాగబాబు వ్యాఖ్యలకు కౌంటర్ గానే నరేష్ ప్రెస్ మీట్?
By: Tupaki Desk | 26 Jun 2021 8:30 AM GMTమూవీ ఆర్టిస్టుల సంఘం (మా) ఎన్నికలు రసవత్తరంగా మారిన సంగతి తెలిసిందే. అయితే ప్రకాష్ రాజ్ కి మద్ధతుగా నిలిచిన మెగా బ్రదర్ నాగబాబు చేసిన వ్యాఖ్య మా అసోసియేషన్ లో హాట్ టాపిక్ గా మారింది. గడిచిన నాలుగేళ్లుగా మా ప్రతిష్ఠ మసకబారిందని ఆయన వ్యాఖ్యానించారు. బహుశా అధ్యక్షుడు శివాజీ రాజా హయాంలో రెండేళ్లు.. ఆ తర్వాత వీకే నరేష్ హయాంలో రెండేళ్లు వివాదాలమయం అవ్వడం తనను కలతకు గురి చేసిందన్నది నాగబాబు అభిప్రాయం అయ్యుండొచ్చు. కానీ దానికి ప్రస్తుత `మా` అధ్యక్షుడు సీనియర్ నరేష్ హర్టయ్యారని ఆయన మాటల్ని బట్టి అర్థమవుతోంది.
మా ప్రతిష్ఠ మసకబారిందని నాగబాబు అన్న మాట షాక్ కి గురి చేసిందని నరేష్ తాజా మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. ఆయన మంచి మిత్రుడే. మా అసోసియేషన్ కోసం మేం చేసిన కార్యక్రమాల్ని చిరంజీవి- నాగబాబుకు చెప్పగా ప్రశంసించారని గుర్తు చేశారు.
తమపై ఆరోపణలకు కౌంటర్ గానే గత రెండేళ్లలో తాను చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. పెన్షన్లు.. జీవిత భీమా.. ఆర్థిక సాయాలు వగైరా వగైరా తాము చేసిన పనులన్నిటినీ నరేష్ వివరణ ఇచ్చుకున్నారు. కథలు చెప్పం .. కాగితాలతో రావడమే అలవాటు అంటూ కాస్త ఎమోషనల్ గా నే మాట్లాడారు. కాలు దువ్వడం దూషించడం కోసం తాను సమావేశం పెట్టలేదని అన్నారు. నేనేంటో చెప్పుకునేందుకే ఈ సమావేశం ఏర్పాటు చేసానని తెలిపారు.
మిత్రుడు ప్రకాష్ రాజ్ మూడు నెలల క్రితమే ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు తనకు చెప్పారని ఆర్టిస్టులు ఎవరైనా పోటీ పడొచ్చని అన్నానని తెలిపారు. స్థానికత అంశంపై తాను ఎప్పుడూ మాట్లాడలేదని కూడా ప్రకాష్ రాజ్ కి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. తాను మద్ధతునిస్తున్న మంచు విష్ణు సినిమాలు తీస్తూ ఉపాధిని కల్పిస్తున్నాడని అన్నారు.
ఆసక్తికరంగా వీకే నరేష్ ఇదే వేదికపై తెలివైన ప్రతిపాదన తెచ్చారు. ఈసారి ఒక మహిళకు అవకాశం కల్పించాలని అధ్యక్ష పదవిని ఏకగ్రీవం చేయాలని కూడా ప్రతిపాదించారు. గత అధ్యక్షులంతా గొప్పగా పని చేశారని చెబుతూనే ఈసారి మహిళకు ఛాన్స్ కల్పించాలని సినీపెద్దల దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేయడం వేడెక్కించింది. ఇక్కడ ఎవరూ పదవుల కోసం పాకులాడటం లేదని.. విజన్ తో వచ్చామని నరేష్ పునరుద్ఘాటించారు. ఈసారి ఎన్నిక ఏకగ్రీవం అయ్యేందుకే ప్రయత్నిస్తున్నామని అన్నారు. మొత్తానికి ప్రకాష్ రాజ్ పై యుద్ధానికి ఒక మహిళను బరిలో దించుతున్నామని వీకే నరేష్ చెప్పకనే చెప్పారన్న చర్చా ప్రస్తుతం వేడెక్కిస్తోంది. అయితే మహిళాధ్యక్షురాలి ప్రతిపాదనతో మంచు విష్ణు పోటీ నుంచి విరమించినట్టేనా కాదా? అన్నది తెలియాల్సి ఉంది.