Begin typing your search above and press return to search.
ఎన్టీఆర్ భక్తుడు వేసిన RRR స్కెచ్ అదిరిందిగా
By: Tupaki Desk | 14 July 2020 10:30 AM GMTRRR కొత్త లుక్ రిలీజ్ చేసేందుకు ఎస్.ఎస్.రాజమౌళి తాత్సారం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలి కాలంలో అసలు ఈ మూవీకి సంబంధించిన ఎలాంటి కొత్త పోస్టర్ ని రిలీజ్ చేయలేదు. అందుకేనేమో అభిమానులు మాత్రం అంతవరకూ వేచి చూసేంత సహనంతో లేరు. ఫ్యాన్స్ ఇదిగో ఇలా స్కెచ్ వేసి మరీ రిలీజ్ చేసేస్తున్నారు. తాజాగా యంగ్ యమ ఎన్టీఆర్ వీర భక్తుడు గీసిన ఓ స్కెచ్ అంతర్జాలంలో అంతే వైరల్ గా మారింది.
ఎన్టీఆర్ బర్త్ డేకి రాజమౌళి కొమురం భీమ్ టీజర్ రిలీజ్ చేస్తాడని భావించినా అది సాధ్యం కాలేదు. కానీ ఈ అభిమాని మాత్రం రాజమౌళితో పాటు అల్లూరి పాత్రధారి రామ్ చరణ్ .. కొమరం భీమ్ పాత్రధారి ఎన్టీఆర్ ఉన్న లుక్ ని అద్భుతంగా డిజైన్ చేశాడు. వీరాధివీరులైన తన ఇద్దరు శిష్యుల్ని కథనరంగంలోకి రాజమౌళినే స్వయంగా చెయ్యి పట్టి నడిపిస్తున్నట్టుగా ఆ ఛాయాచిత్రం చూస్తుంటేనే ఎంతో క్యూరియాసిటీతో పాటు ఫన్ జనరేట్ చేస్తోంది.
దానికి మించి అసలు అల్లూరి అంటే ఇలానే ఉంటాడేమో.. కొమురం భీమ్ అంటే ఇలాంటి వేషధారణతోనే ఉంటాడేమో! అన్నంత అందంగా ఆ ఛాయాచిత్రాల్ని స్కెచ్ వేసిన తీరును ప్రశంసించకుండా ఉండలేం. బ్యాక్ డ్రాప్ లో వార్ నేపథ్యాన్ని స్ఫురించేలా డిజైన్ చేసిన తీరు ఆసక్తికరం. నరేష్ రాములపల్లి అనే పెయింటర్ గీసిన ఈ చిత్రం ఎంతో బ్యూటిఫుల్ గా ఉంది కదూ? మహమ్మారీ కనికరిస్తే ఆర్.ఆర్.ఆర్ పెండింగ్ షూట్ పూర్తి చేసి త్వరగా రిలీజ్ చేయాలన్నది ఎస్.ఎస్.రాజమౌళి ఆలోచన. కానీ అది ఎప్పటికి నెరవేరేనో!! 2021లోనే ఇది సాధ్యం అని భావిస్తున్నారు.