Begin typing your search above and press return to search.

క్షోభ అనుభ‌వించా..శివాజీ రాజాను క్ష‌మిస్తా!

By:  Tupaki Desk   |   11 March 2019 4:33 AM GMT
క్షోభ అనుభ‌వించా..శివాజీ రాజాను క్ష‌మిస్తా!
X
మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) ర‌స‌వ‌త్త‌ర పోరులో సీనియ‌ర్ న‌రేష్ గెలుపొందిన సంగ‌తి తెలిసిందే. నేటి నుంచి మా కొత్త అధ్య‌క్షుడిగా ఆయ‌న బాధ్య‌త‌లు స్వీక‌రించారు. నిన్న సాయంత్రం 10గం.ల అనంత‌రం `మా` ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డ్డాయి. కొత్త అధ్య‌క్షుడిని అభినందిస్తూ శివాజీ రాజా శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ సంద‌ర్భంగా న‌రేష్ ఎంతో ఎమోష‌న‌ల్ గా మాట్లాడుతూ .. శివాజీ రాజాతో శ‌త్రుత్వం లేదు.. `మా`లో క‌లిసి ప‌ని చేసేందుకు ఆహ్వానిస్తున్నామ‌ని అన్నారు. మా కొత్త అధ్య‌క్షుడి గా మ్యానిఫెస్టోలో చెప్పిన‌వ‌న్నీ చేస్తామ‌ని న‌రేష్ ఈ సంద‌ర్భంగా ప్రామిస్ చేశారు.

ఎన్నికల సందర్భంగా కొందరు చేసిన ఆరోపణలు మానసిక క్షోభకు గురి చేశాయ‌ని... ఆ ఆరోపణలేవీ మనసులో పెట్టుకోవడం లేదని అన్నారు. మిత్రుడు శివాజీ రాజాను క్షమిస్తాను.. 30 ఏళ్లు క‌లిసే ప‌ని చేశాం. ఆయనతో ఎలాంటి శతృత్వం లేదు. పదవి లేక పోయినా `మా`తో కలిసి పని చేయాలని అన్నారు. అందరం కలిసే అభివృద్ధికి పాటుప‌డ‌తామని న‌రేష్ తెలిపారు. అమ్మ‌`మా`ను ర‌క్షించుకుందామ‌నేదే మా నినాదం. ఎప్పుడూ ఏదీ ఆశించ‌కుండా `మా` అడ‌గ‌కుండా సాయ‌ప‌డే అమ్మ విజ‌య‌నిర్మ‌ల‌- కృష్ణ‌గారికి ఈ సంద‌ర్భంగా ధ‌న్య‌వాదాలు తెలిపారు. గ‌త టెర్ములోనే న‌న్ను అధ్య‌క్షుడిగా ఉండ‌మంటే శివాజీరాజా ఉండాల‌ని మేమంతా ఏకగ్రీవం చేశాం. మ‌న‌స్తాపాలు వ‌స్తూ ఉంటాయి. మాన‌సిక క్షోభ‌కు గుర‌య్యాను. అది ఎవ‌రి వ‌ల్ల అనేది చెప్ప‌ను అని అన్నారు. మిత్రమా! శివాజీ రాజా.. 50 ఓట్లు రావు.. అధ్య‌క్షుడు కాలేవు అన్నావు. 70 ఓట్ల మెజారిటీతో గెలిచాను. నిన్ను క్ష‌మిస్తాను.. క‌లిసే ప‌ని చేద్దాం అని న‌రేష్ అన్నారు.

మెగాస్టార్ చిరంజీవి గారు - నాగార్జున స‌హా అంద‌రూ మాకు అండ‌గా నిలిచారు. నాగబాబు డైరెక్టుగా వ‌చ్చి.. మీ ప్యానల్ బావుంది మీరు గెలుస్తున్నారు అని చెప్పారు. మా ముగ్గురిపై (న‌రేష్‌-జీవిత‌-రాజ‌శేఖ‌ర్‌) నమ్మకం ఉంచి గెలిపించిన అందరికీ ధన్యవాదములు అన్నారు. జాయింట్ సెక్ర‌ట‌రీ - జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీగా గెలిచాను. ఇప్పుడు అధ్య‌క్షుడిగానూ చేస్తున్నాను.. సేవ చేస్తాను అన్నారు. సిల్వ‌ర్ జూబ్లీ ఏడాది మ‌చ్చ‌ల్ని చెరిపేసి ముందుకు వెళ‌దాం అన్నారు. అమ్మ `మా` సాక్షిగా ఈ ఒక్క టెర్ముకే అధ్య‌క్షుడిగా ఉంటాన‌ని న‌రేష్ తెలిపారు.