Begin typing your search above and press return to search.

చ‌ల‌ప‌తిరావు ఎపిసోడ్ ఇండ‌స్ట్రీకి పెద్ద‌ పాఠ‌మ‌ట‌!

By:  Tupaki Desk   |   23 May 2017 2:08 PM GMT
చ‌ల‌ప‌తిరావు ఎపిసోడ్ ఇండ‌స్ట్రీకి పెద్ద‌ పాఠ‌మ‌ట‌!
X
రారండోయ్ వేడుక చూద్దాం ఆడియో ఫంక్ష‌న్లో సీనియ‌ర్ న‌టుడు చ‌ల‌ప‌తిరావు చేసిన అతి వ్యాఖ్య‌లు రేపిన ర‌చ్చ అంతా ఇంతా కాదు. వాళ్లు.. వీళ్లు అన్న తేడా లేకుండా అంద‌రూ ఆయ‌న మాట‌ల్ని అస‌హ్యించుకోవ‌ట‌మే కాదు.. తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డుతున్నారు. విమ‌ర్శ‌ల‌తో ఊరుకోకుండా కేసులు పెట్టేశారు కూడా.

అంత‌కంత‌కూ పెరిగి పెద్ద‌ది అవుతున్న ఈ ఇష్యూను ఒక కొలిక్కి తెచ్చేందుకు చ‌ల‌ప‌తిరావు ఫేస్ బుక్ లైవ్‌ లోకి వ‌చ్చిన‌ప్ప‌టికీ ఆగ్ర‌హావేశాలు చ‌ల్లార‌లేదు.

చ‌ల‌ప‌తిరావు మాట‌ల‌పై ప‌లువురు సినీ ప్ర‌ముఖులు స్పందిస్తున్నారు. తాజాగా సీనియ‌ర్ హీరో.. మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ ప్ర‌తినిధి న‌రేశ్ రియాక్ట్ అయ్యారు. తాజాగా చెల‌రేగిన దుమారంం సినిమా ఇండ‌స్ట్రీకి ఒక గుణ‌పాఠంగా ఆయ‌న అభివ‌ర్ణించారు. సినిమా ఫంక్ష‌న్లు చాలావ‌ర‌కూ జోకుల‌తోనే సాగుతాయ‌ని.. కాకుంటే హాస్యానికి.. అవ‌స‌రం లేని వ్యాఖ్య‌ల‌కు మ‌ధ్య‌న ఉండే మంచుపొర‌ను గుర్తించ‌క‌పోవ‌టంతోనే ఇలాంటి స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌న్నారు.

న‌టీన‌టులు సంయ‌మ‌నం పాటించ‌టం అవ‌స‌ర‌మ‌న్న ఆయ‌న‌.. వ్య‌క్తిగ‌త జీవితాల్లో ఎలా ఉన్నా.. న‌లుగురు ఉండే వేదిక‌ల మీద జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాల‌ని.. అది అంద‌రి బాధ్య‌త‌న్నారు. న‌రేశ్ వ్యాఖ్య‌లు చూస్తే.. న‌లుగురి మ‌ధ్య‌కు వ‌చ్చిన‌ప్పుడు కాస్త ఒళ్లు ద‌గ్గ‌ర పెట్టుకోవాల‌న్న మాట‌ను కాస్త మ‌ర్యాద‌గా చెప్పిన‌ట్లుగా ఉంద‌న్న వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.