Begin typing your search above and press return to search.
`మా`లో ముసలం..కరోనా సమయంలో కోటి ఖర్చయిందా?
By: Tupaki Desk | 9 Aug 2021 3:30 PM GMTమూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) నిధుల విషయంలో అవకతవకలు జరిగాయని సభ్యురాలు హేమ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నిధి విషయంలో ప్రధాన కార్యదర్శి జీవితా రాజశేఖర్ ఎలాంటి దుర్వినియోగం జరగలేదని వివరణ ఇచ్చే ప్రయత్నం చేసారు. తాజాగా దీనిపై తాత్కాలిక అధ్యక్షుడు నరేష్ కూడా స్పందించారు.
`మా` ఫండ్స్ దుర్వినియోగం చేస్తున్నామని.. దివాళా తీస్తుందన్న వ్యాఖ్యలు బాధాకరం. మా దగ్గర అన్ని ఆధారలున్నాయి. మెంబర్ షిప్ ద్వారా 84 లక్షలు వచ్చింది. జీవిత పదిలక్షలు ఇచ్చారు. వివిధ మార్గాల ద్వారా వచ్చిన 14 లక్షలను నేనే స్వయంగా డిపాజిట్ చేసా. అలాగే కరోనా సమయంలో కష్టకాలంలో ఆదుకోవడానికి..హెల్త్ ఇన్సురెన్స్ లకు కలిపి కోటి రూపాయలు ఖర్చు అయిందని నరేష్ తెలిపారు. ఫండ్స్ దుర్వినియోగం అవుతుందనే మాట ఎంతో బాధ కల్గించింది. మా టర్మ్ లో కోటి వరకూ విరాళాలు సేకరించాం. ఎక్కడా ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం అవ్వలేదు. ఆధారాలు లేని ఆరోపణలు చేయడం సరికాదన్నారు.
హేమ చేసిన వ్యాఖ్యల్ని ఖండిస్తున్నాం. ఈ విషయాన్ని క్రమ శిక్షణా కమిటీ దృష్టికి తీసుకెళ్లాం. వాళ్లు ఏ నిర్ణయం తీసుకుంటే దాన్ని అమలు పరుచుతాం. మేము కేవలం భద్రత కోసమే పనిచేస్తున్నాం. మూడు టర్మ్ ల ఆర్ధిక లావాదేవీలను వివరిస్తాం. పరుచూరి గోపాలకృష్ణ గారి సలహాలతో మార్చిలో జరగాల్సిన ఎన్నికలు సెప్టెంబర్ లో నిర్వహిస్తాం. అదీ అప్పటి పరిస్థితులను బట్టి మారే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఆగస్ట్ 22న మరోసారి వర్చువల్ గా జనరల్ బాడీ సమావేశం నిర్వహించి నిర్ణజ్ఞం తీసుకుంటామన్నారు. అలాగే సమావేశంలో అకౌంట్స్ కు సంబంధించి ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏకగ్రీవంగా ఆమోదించిందని నరేష్ తెలిపారు.
ఇంతకుముందు శివాజీ రాజా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మా సంఘంలో నిధులు దుర్వినియోగం అయ్యాయని నరేష్ ఆరోపించిన సంగతి తెలిసినదే. దానికి కౌంటర్ గానే ఇప్పుడు హేమ ఆరోపించారా? అన్నది సభ్యుల్లో హాట్ టాపిక్ గా మారింది. అయితే శివాజీ రాజా బృందం నిధులు దుర్వినియోగం చేయలేదని సంక్షేమ కార్యక్రమాల కోసం సద్వినియోగం చేశారని మెగా బ్రదర్ నాగబాబు క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసినదే. కమిటీల్లో ఇలా నిధుల దుర్వినియోగం ప్రతిసారీ హాట్ టాపిక్ గా మారుతోంది. దీనిని క్రమశిక్షణా కమిటీ ఆపడంలో విఫలమవుతోందన్న విమర్శలు వస్తున్నాయి.
ఎన్నికల నగారా మోగాక ఎవరికి వారే..!
మూవీ ఆర్టిస్టుల సంఘం ఎన్నికలు చాలాకాలంగా వాయిదా పడిన సంగతి తెలిసినదే. కరోనా క్రైసిస్ వల్ల ఇప్పటికే జరగాల్సిన ఎన్నికలు ఆగిపోయాయి. అయితే ఇటీవల కృష్ణంరాజు అధ్యక్షతన వర్చువల్ ఈసీ మీటింగ్ లో చివరికి ఎలక్షన్ కన్ఫామ్ అయ్యింది. మా ఎన్నికలు సెప్టెంబర్ లోనే జరపాలన్న చర్చ వేడెక్కించింది. మీటింగ్ అనంతరం ఫలానా తేదీ అని ప్రకటించడం ఒక్కటే పెండింగ్. సెప్టెంబర్ లో ఎన్నికలు ఖాయమైనట్టేనని మా సభ్యుల్లో చర్చ సాగింది.
ఇటీవల జరిగిన ఈసీ వర్చువల్ సమావేశంలో ప్రస్తుత అధ్యక్షుడు సీనియర్ నరేష్ పదవీకాలం ముగియడంతో ఎన్నికలు నిర్వహించబోతున్నందున రాజీనామా చేయడానికి అంగీకరించారు. నిజానికి కోవిడ్ థర్డ్ వేవ్ ప్రమాదం ఉన్నందున ఎన్నికల్ని వచ్చే ఏడాదికి వాయిదా వేయాలని డిమాండ్ చేసినట్టు కథనాలొచ్చాయి. కానీ సినీపెద్దలైన చిరంజీవి మోహన్ బాబు తదితరులు సకాలంలో ఎలక్షన్ జరగాలని భావించి ఈ నిర్ణయం తీసుకున్నారట. సెప్టెంబర్ 12న ఎన్నికలు జరిగే వీలుందని కథనాలొస్తున్నాయి. అయితే దీనిని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.