Begin typing your search above and press return to search.

ఆ వారసుడికి ఇంకో సినిమా

By:  Tupaki Desk   |   24 May 2018 4:22 AM GMT
ఆ వారసుడికి ఇంకో సినిమా
X

సినిమా ఇండస్ట్రీలో వారసుల హవా ఎక్కువే. కొంతమంది వారసత్వంతో సినిమాల్లోకి ఎంటరయినా త్వరగానే సొంత ఫ్యాన్ బేస్ సంపాదించుకుని కెరీర్ లో నిలదొక్కుకోగలుగుతారు. ఇంకొంతమందికి వారసత్వం అనేది మొదటి మెట్టుగానే మిగిలిపోతోంది. ఆ తరవాత కెరీర్ లో ముందుకెళ్లలేక.. వెనక్కు వెళ్లలేక ఊగిసలాడుతూ ఉండిపోతుంటారు.

ఒకప్పటి కామెడీ హీరో.. ఇప్పటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ నరేష్ కొడుకు నవీన్ కృష్ణ కూడా ఇలా స్ట్రగుల్ అవుతున్నవాడే. నవీన్ కృష్ణ హీరోగా ఇప్పటికే ఓ సినిమా వచ్చింది. నందిని నర్సింగ్ హోం టైటిల్ తో రెండేళ్ల క్రితం ఈ మూవీ రిలీజైంది. కానీ అప్పట్లో పెద్దగా ఆడకపోవడంతో ఆ సినిమా నవీన్ కెరీర్ కు ఏరకంగానూ ప్లస్సవ్వలేదు. మళ్లీ ఇన్నాళ్లకు నవీన్ ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే స్టార్టయి కొంత పార్ట్ పూర్తయిపోయింది కూడా.

కొత్త డైరెక్టర్ బాలాజీ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో నవీన్ తో పాటు అవసరాల శ్రీనివాస్ కూడా హీరోగా చేస్తున్నాడు. అసలు నవీన్ హీరోగా ఓ భారీ సినిమా తీద్దామని నరేష్ ప్లాన్ చేశాడు. కానీ మొదట్లోనే ఫైనాన్షియల్ ప్రాబ్లెమ్స్ ఎదురవడంతో ఆ సినిమా అటకెక్కేసింది. అప్పటి నుంచి నవీన్ సొంత టాలెంట్ తోనే పైకి రావడానికి తంటాలు పడుతున్నాడు. మళ్లీ ఇన్నాళ్లకు అతడికో అవకాశం దక్కింది.