Begin typing your search above and press return to search.

నిప్పు- ఉప్పు: 'మా' లో ఏం జ‌రుగుతోంది?

By:  Tupaki Desk   |   30 Jan 2019 1:30 AM GMT
నిప్పు- ఉప్పు: మా లో ఏం జ‌రుగుతోంది?
X
కొన్ని వివాదాలు నివురుగ‌ప్పిన నిప్పులా ఉంటాయి. కొలిమిలో కాలుతున్న చువ్వ మీద నీళ్లు చ‌ల్లితే వ‌చ్చే సౌండులా బుస‌బుస మంటూ పైకి తెలియ‌వు. ప్ర‌స్తుతం మూవీ ఆర్టిస్టుల సంఘంలో స‌న్నివేశం అలానే ఉందా? అంటే అవున‌నే ఉప్పందుతోంది. అస‌లింత‌కీ మూవీ ఆర్టిస్టుల సంఘంలో అస‌లేం జ‌రుగుతోంది? ఫండ్ గోల్ మాల్ .. వ్య‌క్తిగ‌త ప్రాప‌కం! అంటూ మా అధ్య‌క్షుడు శివాజీ రాజాపై ఫిర్యాదు చేసిన ట్రెజ‌ర‌ర్ సీనియ‌ర్ న‌రేష్ ప్ర‌స్తుతానికి స‌ద్దుమ‌ణిగిన‌ట్టే క‌నిపిస్తున్నా లోన ఇంకేదో జ‌రుగుతోంది.. అన్న సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. అప్ప‌ట్లో పెద్ద‌లు త‌ల‌దూర్చి గొడ‌వ‌ను శాంత ప‌రిచారంతే. ఆ ఇద్ద‌రి మ‌ధ్యా స‌యోధ్య కుద‌ర‌లేదు. అధ్య‌క్షుడు, ట్రెజ‌ర‌ర్ మ‌ధ్య మంట‌లు ఇంకా చ‌ల్లార‌లేదు అన్న క్లూ అందుతోంది.

2019 మూవీ ఆర్టిస్టుల సంఘం ఎన్నిక‌ల స్టంట్ లో ఇవ‌న్నీ బ‌య‌ట‌ప‌డేందుకు ఆస్కారం ఉంద‌న్న ముచ్చ‌టా సాగుతోంది. మా ప్ర‌స్తుత సంఘం గ‌డువు ముగుస్తుండ‌డంతో మ‌రోసారి ఎన్నిక‌ల‌కు స‌మ‌య‌మాస‌న్న‌మ‌వుతోంది. ఈసారి ఎన్నిక‌ల్లో ఎవ‌రెవ‌రి మ‌ధ్య పోటీ ఉంటుంది? అంటే .. ప్ర‌ధానంగా వివాదాల్లోకి వ‌చ్చిన‌ ఆ ఇద్ద‌రి పేర్లే ప్ర‌ముఖంగా వినిపిస్తున్నాయి. మ‌రోసారి ఎల‌క్ష‌న్ లో గెలిచి తానే అధ్య‌క్షుడ‌వ్వాల‌ని శివాజీ రాజా భావిస్తుంటే - అతడికి అన్ని ర‌కాలుగా ముకుతాడు వేయాల‌ని నరేష్ భావిస్తున్నార‌ట‌. ఆ మేర‌కు ఆర్టిస్టుల్లో గుస‌గుస‌లు వినిపించాయి.

అయితే వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎవ‌రు నెగ్గినా ఎవ‌రు ఓడినా మూవీ ఆర్టిస్టుల సంఘం సొంత భ‌వంతిని నిర్మించాల్సిన అవ‌స‌రం ఉంది. ఇప్ప‌టిక కృష్ణ- విజ‌య నిర్మ‌ల దంప‌తులు స‌హా కృష్ణం రాజు, చిరంజీవి వంటి పెద్ద‌లు అందుకోసం బోలెడంత సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. కానీ వారి సేవ‌ల్ని స‌రిగా వినియోగించుకోవ‌డంలో మా త‌డ‌బ‌డిందంటే అతిశ‌యోక్తి కాదు. అధ్య‌క్షుడు - ట్రెజ‌ర‌ర్ ఒక‌రిపై ఒక‌రు కారాలు మిరియాలు నూరుకోవ‌డంతో ఇంటి గుట్టు కాస్తా రోడ్డెక్కింది. ఇక‌పై అలాంటి చ‌ర్య‌ల‌కు పాల్ప‌డ‌కుండా ఆర్టిస్టుల‌ పురోగ‌తిపై ఆలోచిస్తార‌నే అంతా ఆశిస్తున్నారు. ఇప్ప‌టికే పెన్ష‌న్ స్కీమ్ - క‌ళ్యాణ‌ - విద్యా ల‌క్ష్మీ స్కీమ్ పేరుతో ప‌లు ర‌కాల మంచి ప‌నులు చేసింది ప్ర‌స్తుత టీమ్. ఆ గుర్తింపు అలానే నిల‌బ‌డాలంటే ఇక‌పైనా ఇలాంటి మంచి ప‌నులు చేయాల్సి ఉంటుంద‌ని మా మేలు కోరుతున్నారు. అలాగే 700 మంది ఆర్టిస్టులు న్న అతి పెద్ద‌ అసోసియేష‌న్ కి సొంత బిల్డింగ్ లేక‌పోవ‌డంపైనా పెద‌వి విరుపులు క‌నిపిస్తున్నాయి. ఈ ప‌నిని స‌త్వ‌ర‌మే చేప‌ట్టాల్సి ఉంది.