Begin typing your search above and press return to search.

సీనియర్ నటుడు సొంతంగా స్టోరీ రాశాడు

By:  Tupaki Desk   |   17 March 2016 1:30 PM GMT
సీనియర్ నటుడు సొంతంగా స్టోరీ రాశాడు
X
80ల్లో కామెడీ హీరోగా ఓ వెలుగు వెలిగాడు సీనియర్ హీరో నరేష్. హాస్య బ్రహ్మ జంధ్యాల సినిమాలతో ఆయన పండించిన వినోదాన్ని ఎవ్వరూ మరిచిపోలేరు. ఐతే మిడిలేజ్ లోకి వచ్చాక హీరో వేషాలు తగ్గిపోయి కొన్నేళ్ల పాటు కనుమరుగైపోయాడు నరేష్. ఐతే ఈ మధ్య మళ్లీ క్యారెక్టర్ రోల్స్ తో తన ప్రత్యేకత చాటుకుంటున్నాడు. లేటెస్ట్ రిలీజ్ ‘గుంటూరు టాకీస్’లో ఆయన పోషించిన గిరి పాత్ర తెలుగు ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంది. మంచి పాత్ర పడాలే కానీ.. దాన్ని అద్భుతంగా రక్తి కట్టించగలనని నరేష్ చాటుకున్నాడు. ఈ మధ్యే డాక్టరేట్ గౌరవాన్ని కూడా పొందిన నరేష్.. ప్రస్తుతం టాలీవుడ్ లో బిజీయెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్టుల్లో ఒకరని చెప్పాలి.

బ్రహ్మోత్సవం - అ..ఆ లాంటి పెద్ద సినిమాలు ఆయన చేతిలో ఉన్నాయి. మొత్తంగా 12 సినిమాల దాకా ఆయన చేతిలో ఉన్నాయి. ఐతే కేవలం నటనకు పరిమితం కాకుండా.. తొలిసారి తన రైటింగ్ టాలెంట్ కూడా చూపించబోతున్నాడట నరేష్. ఆయన స్వయంగా ఓ స్క్రిప్టు రాస్తున్నట్లు సమాచారం. ఓ వెరైటీ కథాంశంతో ఈ స్క్రిప్టు తీర్చిదిద్దుతున్నాడు. ఆ కథతోనే ప్రవీణ్ సత్తారు తన తర్వాతి సినిమా తీయబోతున్నట్లు సమాచారం. ‘చందమామ కథలు’ దగ్గర్నుంచి నరేష్ - ప్రవీణ్ లకు మంచి స్నేహం కుదిరింది. ఆ స్నేహంతోనే ‘గుంటూరు టాకీస్’లో నరేష్ కు హీరో స్థాయి పాత్ర ఇచ్చాడు ప్రవీణ్. ఈ దర్శకుడి టాలెంట్ గురించి పలు వేదికల్లో గొప్పగా పొగిడిన నరేష్.. ఇప్పుడు స్వయంగా అతడి కోసం స్క్రిప్టు రాసి ఇస్తుండటం విశేషమే.