Begin typing your search above and press return to search.
కమిట్ మెంట్ అడిగితే నో చెప్పిందట.. ఛాన్సులు రాలేదట
By: Tupaki Desk | 9 Aug 2021 3:30 AM GMTక్యాస్టింగ్ కౌచ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గతానికి భిన్నంగా ఇప్పుడు చాలామంది హీరోయిన్లు.. మహిళా సెలబ్రిటీలు తమకు ఎదురైన చేదు అనుభవాల్ని ఓపెన్ గా చెప్పేస్తున్నారు. గతంలో పంటి బిగువునా బాధను అణిచిపెట్టుకునే వారే తప్పించి ఓపెన్ కావటానికి ఇష్టపడే వారు కాదు. మారిన కాలానికి తగ్గట్లు ఇప్పుడు పరిస్థితుల్లోనూ మార్పులు వచ్చేశాయి. ఎవరో ఏదో అనుకుంటారన్న విషయాన్ని వదిలేసి.. ఉన్నది ఉన్నట్లు చెప్పటానికి ఏ మాత్రం మొహమాటపడని వైనం ఇప్పుడు ఎక్కువైంది.
తాజాగా ఆ జాబితాలోకి చేరారు బాలీవుడ్ బ్యూటీ నర్గీస్ ఫక్రీ. చెక్కిన శిల్పంలా ఉండే ఆమె తన తొలి సినిమా ‘రాక్ స్టార్’తో రాక్ చేసింది. అంతేనా.. తొలి సినిమాతోనే ఫిలింఫేర్ అవార్డును సొంతం చేసుకుంది. అందానికి అందం.. టాలెంట్ కు టాలెంట్.. అన్నింటికి మించిన తన తొలి సినిమాతోనే సూపర్ సక్సెస్ ను చవి చూసిన ఆమెకు.. అవకాశాలు తన్నుకుంటూ రావాలి. అందుకు భిన్నంగా ఆమెకు మాత్రం అవకాశాలు రాని పరిస్థితి. అయితే.. దీనికి కారణం ఏమిటన్న విషయాన్ని ఇప్పటివరకు బయటపెట్టని నర్గీస్.. తాజాగా ఒక మీడియా సంస్థతో మాట్లాడారు.
ఈ సందర్భంగా తనకు ఎదురైన క్యాస్టిక్ కౌచ్ ఉదంతాన్ని చెప్పేశారు. తన మొదటి సినిమా సూపర్ హిట్ అయ్యాక కూడా.. తనకు అవకాశాలు రాలేదని.. ఆ మూవీ సక్సెస్ సాధించినప్పటికీ.. ఛాన్సుల కోసం నగ్నంగా కనిపించాలని కోరారని.. అందుకు తాను ఒప్పుకోలేదన్నారు. ‘మొదటి సినిమా సూపర్ సక్సెస్ అయితే ఎక్కడైనా హీరో హీరోయిన్లకు అవకాశాలు వస్తాయి. కానీ.. నా విషయంలో అలా జరగలేదు. బాలీవుడ్ లో రాణించాలంటే దర్శక - నిర్మాతల కోరిక తీర్చాల్సిందే. వారి చెప్పినట్లు చేయాలి. వారికి నగ్నంగా కనిపించాలి. అలా చేయనందుకే నాకు అవకాశాలు తగ్గాయి. కొందరు బడా నిర్మాతలు నన్ను కమిట్ మెంట్ అడిగారు. అందుకు నేను ఒప్పుకోలేదు. దీంతో ఆ విషయాన్ని మనసులో పెట్టుకొని నాకు ఆఫర్స్ రాకుండా చేశారు’ అని ఓపెన్ అయ్యారు.
సూపర్ సక్సెస్ సొంతం చేసుకున్నా.. నటి అయిన పాపానికి కమిట్ మెంట్ ఇవ్వాలన్నట్లుగా ఉంది కదూ నర్గీస్ మాటల్ని వింటే. ఇలాంటి దారుణాల్ని అందరూ ఓపెన్ అయితే కానీ.. ఈ దరిద్రాలకు పుల్ స్టాప్ పడే వీలుందని చెప్పక తప్పదు. నర్గీస్ చెప్పిన తర్వాత.. మరికొందరు నటీమణులకు ఆమె మాటలు స్ఫూర్తిని రగిలిస్తాయో? లేదో? చూడాలి.