Begin typing your search above and press return to search.

హాట్ హీరోయిన్ సొల్లు కబుర్లు చూడండి

By:  Tupaki Desk   |   14 Sep 2016 9:47 AM GMT
హాట్ హీరోయిన్ సొల్లు కబుర్లు చూడండి
X
‘అఆ’ సినిమాలో గిరిబాబు క్యారెక్టర్ భలే సరదాగా ఉంటుంది. మీకేం తెలుసండీ మా డబ్బున్నోళ్ల కష్టాలు అంటూ ఆ క్యారెక్టర్ పలికే డైలాగ్ బాగా పేలింది. సరిగ్గా ఇలాగే మాట్లాడుతోంది బాలీవుడ్ హాట్ బ్యూటీ నర్గీస్ ఫక్రి. డబ్బుంటే.. స్టార్ డమ్ వస్తే చాలా కష్టాలు ఉంటాయని.. అందుకే పేదరికంలో ఉండటం మేలని.. అందులోనే చాలా సంతోషం ఉందని గొప్ప ఫిలాసఫీ చెప్పింది నర్గీస్. ఆ కబుర్లన్నీ చెప్పాక.. పోనీ అన్నీ వదిలేసి పేదదానిగా మారిపోరాదూ అంటూ మాత్రం అదంతా కుదరదు అంటోంది.

‘‘స్టార్‌ డమ్‌ వల్ల ఎన్నో విషయాలు నేర్చుకున్నా. ఎంతసేపు పనిచేస్తూనే ఉండటం అలవాటైపోతుంది. ఐతే ఒక్కోసారి దీనికంటే పేదరికంలో ఉన్నప్పుడే సంతోషంగా ఉన్నట్లు అనిపిస్తుంది. నేనేదో జోక్‌ చేస్తున్నా అని అనుకోకండి. ఇది నిజం. పేదరికంలో ఉన్నపుడు ఒక్కపూట భోజనం కోసం ఎంతో కష్టపడతాం. అలాంటి సమయంలో ఈ పూట గడిస్తే చాలు అని భావిస్తాం కాబట్టి వేరే ఆలోచనలు ఉండవు. అదే ఎక్కువగా కష్టపడి ఎక్కువ డబ్బులు సంపాదిస్తే.. వాటితో లగ్జరీగా బతకాలని ఆశపుడుతుంది. దానికోసం ఏవేవో కావాలనిపిస్తుంది. దాంతో వాటన్నింటిని సమకూర్చుకోవడంలో చాలా ఒత్తిడికి గురవుతాం. మనశ్శాంతి కరవవుతుంది. కానీ మనం ఎంత సంపాదించిన కూడు - గూడు లేకుండా మాత్రం ఉండలేం కదా. అదే డబ్బు తక్కువ ఉన్నప్పుడు మనకు కావాల్సినంత మాత్రమే సంపాదించుకొని సంతోషంగా ఉంటాం’’ అంటూ ఫిలాసఫీ వినిపించింది నర్గీస్. పేదరికం మీద ఇంతగా మక్కువ ఉన్నపుడు.. అందులో అంత సంతోషం ఉంటుందని అనిపిస్తున్నపుడు అన్నీ వదిలేసి పేదరికంలోకి వెళ్తారా అంటే మాత్రం అలా కుదరదని తేల్చేసింది నర్గీస్. ఇదే కదా హిపోక్రసీ అంటే.