Begin typing your search above and press return to search.
రోడ్‌సైడ్ కిడ్ కాదు.. రిచ్ కిడ్
By: Tupaki Desk | 27 Jun 2015 10:30 PM GMTదేనికైనా పెట్టి పుట్టాలి అంటుంటారు. పుడితే రిచ్ కిడ్‌లా పుట్టాలి. అప్పుడే లైఫంతా రిచ్‌గా జాలీగా గడిచిపోతుంది. లేదూ రోడ్ సైడ్ కిడ్‌లా పుడితే కథే వేరుగా ఉంటుంది. ఇదిగో ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న ఈ భామ పుట్టుకతోనే రిచ్ కిడ్. ఆ రిచ్‌నెస్సే అమ్మడిని సూపర్‌మోడల్‌ని చేసింది. సూపర్‌మోడల్ అంటే ఆషామాషీ సూపర్ మోడల్ కాదండోయ్.
అమెరికా లాంటి అగ్ర రాజ్యంలో సూపర్‌మోడల్ టైటిల్‌ని అందుకుంది. లండన్ మూలాలున్న ఈ బ్యూటీ అమెరికన్లనే తన షార్ప్ లుక్స్‌తో ఒణికించింది. ఆ తర్వాత బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. అక్కడ ఆరంభమే రాక్ స్టార్ లాంటి హిట్ సినిమాలో నటించింది. అటుపై కెరీర్ పరంగా వెనక్కి తిరిగి చూసుకునే పనేలేదు. అయితే తనకి అవకాశం వచ్చింది కదా అని ఏది పడితే అది ఒప్పుకోదు. యువతరం గుండెనరాల్ని మీటేసే సెలక్లివ్ క్యారెక్టర్లకు మాత్రమే ఓకే చెబుతూ ఏడాదికి ఒకటి అరా సినిమాలు మాత్రమే చేస్తోంది. ఇటీవలి కాలంలో మద్రాస్ కేఫ్, మై తేరా హీరో లాంటి చిత్రాల్లో నటించి మెప్పించింది.
అంతేకాదు.. హాలీవుడ్ ఎరోటిక్ కామెడీ 'స్పై'లో నటించి ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవలే నర్గీస్ ఓ ప్రముఖ కార్పొరెట్ కంపెనీ వాణిజ్య ప్రకటనలో నటించి టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. లగ్జరీ విల్లాల్ని నిర్మించే రియల్ ఎస్టేట్ సంస్థ కాస్టెల్ రాయ్‌లే కోసం ప్రచారం చేసింది. బ్లాక్ గౌన్, డిజైనర్ వేర్ వెరీ స్పెషల్‌గా ఉంది కదూ! నర్గీస్‌పై ఫోటోషూట్‌కి సంబంధించిన ఫోటోలివి.