Begin typing your search above and press return to search.
డబ్బు వల్లే కష్టాలన్నీ అంటున్న హాట్ బేబ్
By: Tupaki Desk | 23 Sep 2016 11:30 PM GMTఈ మధ్య మాటెత్తితే వేదాంతం మాట్లాడేస్తోంది బాలీవుడ్ హాట్ బేబ్ నర్గీస్ ఫక్రి. బాయ్ ఫ్రెండ్ ఉదయ్ చోప్రా టాటా చెప్పేయడమే ఇందుకు కారణమేమో తెలియదు కానీ.. డబ్బుంటేనే సమస్యలు.. పేదరికంలోనే సంతోషం ఉంది అంటూ ఈ మధ్య ఆమె చెప్పిన వేదాంతం పెద్ద చర్చనీయాంశమైంది ఇప్పుడు మరోసారి ఆ టాపిక్ ఎత్తింది నర్గీస్. డబ్బు వల్ల సంతోషం పోతుంది అంటూనే.. పేదరికంలోకి మాత్రం వెళ్లలేనంటూ రెండు నాల్కలతో మాట్లాడుతోంది నర్గీస్. ఈ టాపిక్ మీద ఆమె ఏమంటోందో చూడండి.
‘‘సంపాదన పెరిగే కొద్దీ సమస్యలు ఎక్కువ అవుతాయేమో అనిపిస్తోంది. రోయిన్‌గా కన్నా మామూలు వ్యక్తిగానే చాలా సంతోషంగా ఉండేదాన్ని. డబ్బు తక్కువగా ఉన్నప్పుడే బావుండేది. ఇప్పుడు ప్రెజర్ పెరిగింది. మనశ్శాంతి కరువైంది. ఇతర సమస్యలూ పెరిగాయి. కొన్ని సమస్యల నుంచి ఎంత తప్పించుకుందామనుకున్నా కుదరదు. అలాగని డబ్బు లేకుండా కూడా ఉండలేను. పేదరికంలో బతకలేను. ఈ స్థాయికి చేరుకున్న తరువాత ఇప్పుడు మళ్లీ పేదరికంలో ఇమడలేను’’ అని నర్గీస్ చెప్పింది.
బాలీవుడ్ తనకెన్నో పాఠాలు నేర్పిందని.. మోసగాళ్ళ నుంచి ఎలా తప్పించుకోవాలో నేర్చుకున్నానని అన్న నర్గీస్.. ఎట్టి పరిస్థితుల్లోనూ ధైర్యాన్నీ.. ఆత్మవిశ్వాసాన్నీ కోల్పోకుండా ఎలా ఉండాలో తెలుసుకున్నానని చెప్పింది. ప్రస్తుతానికి ప్రేమ.. పెళ్లి గురించి ఆలోచించే తీరిక లేదని.. ఇంత వరకూ తన మనసుకు నచ్చిన వ్యక్తి తారస పడలేదని.. అలాంటి వ్యక్తి దొరికితే తప్పకుండా ప్రేమించి పెళ్ళి చేసుకుంటానని నర్గీస్ అంది.