Begin typing your search above and press return to search.

వైట్ అండ్ వైట్ వయ్యారాలు చూస్తారా?

By:  Tupaki Desk   |   31 March 2016 10:30 PM GMT
వైట్ అండ్ వైట్ వయ్యారాలు చూస్తారా?
X
అందంగా ఉండడం ఓ లెక్క అయితే.. దాన్ని ప్రెజెంట్ చేసుకోవడం, రిప్రజెంట్ చేసుకోవడంలో తెలివితేటలు చాలా ఉండాలి. బాలీవుడ్ భామ నర్గీస్ ఫక్రీకి ఇలాంటి ఇంటెలిజెన్స్ ఫుల్లుగా ఉంది. మోడల్ గా ఉంటూనే సినిమాల్లో వెలిగిపోతున్న ఈ న్యూయార్క్ భామ.. ఎప్పటికప్పుడు కొత్త అందాలను కళాత్మకంగా ప్రజెంట్ చేస్తూ ఉంటుంది.

ఫ్యాషన్ మేగజైన్ ఫెమినాకి ఏప్రిల్ కవర్ పేజ్ పై ఇప్పుడు నర్గీస్ ఫక్రీ చూపిస్తున్న అందాలు.. మత్తెక్కించేస్తున్నాయి. ఫుల్ వైట్ ఔట్ ఫిట్స్ తో ఈ భామ చేసిన సందడి మామూలుగా లేదు. కవర్ పేజ్ నుంచి ఇన్నర్ పేజ్ వరకూ వైట్ అండ్ వైట్ లో ఈ తెల్ల తోలు సుందరి మిలమిల్లాడిపోతోంది. అసలే ట్రాన్స్ పరెంట్ వైట్ టాప్.. దానికి తోడు క్లీవేజ్ కనిపించేలా మిని టాప్, మైక్రో మినీస్ కి చేరువలో బాటమ్.. మొత్తం కలిపితే మత్తెక్కించే బ్యూటికి మరోపేరు అనిపిస్తోంది నర్గీస్.

బాలీవుడ్ లో గతేడాది ఈ భామ సందడి ఎక్కువగా లేకపోయినా.. ఈ ఏడాది మాత్రం తన కెరీర్ లో బెస్ట్ అనిపించుకోదగ్గ సినిమాలు చేస్తోంది. హెరాఫెరీ3 - హౌజ్ ఫుల్ 3 - బాంజోలతో పాటు... క్రికెటర్ అజారుద్దీన్ లైఫ్ స్టోరీపై రూపొందుతున్న సినిమాలో సంగీతా బిజిలానీ పాత్రలో కనిపించనుంది నర్గీస్ ఫక్రీ.