Begin typing your search above and press return to search.
ఫస్ట్ లుక్: నరుడా డోనరుడా నీకేం కోరిక?
By: Tupaki Desk | 19 Sep 2016 12:40 PM GMTనరుడా ఓ నరుడా నీకేమి కోరికా.. అంటూ అప్పట్లో రంభ రాగాలు తీస్తుంటే.. పక్కనే బాలయ్య చిందులేశాడు. ఇది భైరవద్వీపం కహానీ. అయితే ఇప్పుడు మాత్రం ''నరుడా డోనరుడా'' అంటున్నాడు హీరో సుమంత్. ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే వచ్చింది అన్నట్లుంది ఈ పోస్టర్ రాక. పదండి అసలు ఈ సినిమా కథాకమీమిషు ఏంటో చూద్దాం.
హిందీలో సూపర్ హిట్ అయిన సినిమా 'విక్కీ డోనర్'. ఈ సినిమాను చాలామంది తెలుగులో రీమేక్ చేయాలని అనుకున్నారు. చివరకు మల్లిక్ రామ్ అనే కొత్త కుర్రాడి డైరక్షన్లో.. సుమంత్ దీనిని రీమేక్ చేశాడు. చాన్నాళ్ళుగా ఈ సినిమా షూటింగ్ జరుగుతూ ఉన్నా కూడా.. ఎందుకో ఔట్ పుట్ బయటకు వచ్చి సినిమా రిలీజవ్వడానికి చాలా టైము పట్టేలానే ఉంది. అదిగొ ఇప్పుడు తొలి స్టెప్ గా మనోళ్ళు ఫస్ట లుక్ రిలీజ్ చేశారు. డైరక్టుగా పోస్టర్ మీదనే ఐ యామ్ స్పెర్మ్ డోనార్ అని చెప్పేస్తూ.. ధియేటర్లో ఏం చూపించబోతున్నాడో క్లారిటీగా చెప్పేస్తున్నారులే. అదే ఈ పోస్టర్లలో బాగున్న అంశం.
ఇకపోతే సుమంత ఈ సినిమాతో నీకేం కోరిక అంటే.. ఇంకేం చెబుతాడు.. నాకు ఒక హిట్టు కావాలి అని కోరుకుంటాడు. మరి ప్రేక్షకులు ఈ స్పెర్మ్ డోనార్కు ధియేటర్లలో డబ్బులు డొనేట్ చేసి హిట్టును పుట్టిస్తారా? వెయిట్ అండ్ సి.