Begin typing your search above and press return to search.

ఊర్వ‌శీ రౌతేలా గాలి తీసేసిన పాక్ పేస‌ర్!

By:  Tupaki Desk   |   12 Sep 2022 12:30 AM GMT
ఊర్వ‌శీ రౌతేలా గాలి తీసేసిన పాక్ పేస‌ర్!
X
క్రికెట‌ర్ రిష‌బ్ పంత్ వ‌ర్సెస్ ఊర్వశి రౌతేలా మ‌ధ్య వివాదం ఆ మ‌ధ్య తారా స్థాయికి చేరిన సంగ‌తి తెలిసిందే. ఇరువురు నువ్వెంతంటే? నువ్వెతంని ప‌రోక్షంగా త‌గాదాకి దిగారు. అస‌లు వివాదానికి కార‌ణం ఏంట‌న్న‌ది? క్లారిటీ లేదు గానీ..నెట్టింట ఇద్ద‌రు హాట్ టాపిక్ గా మారారు. సోష‌ల్ మీడియా వేద‌కిగా ఇరువురు రెండుసార్లు వాగ్వివాదానికి దిగారు.

ఒక‌రిపై ఒక‌రు సెటైర్లు గుప్పించుకున్నారు. చివ‌రికి ఆ వివాదం ఎలాగూ చ‌ల్లారింది. తాజాగా ఫైన‌ల్ మ్యాచ్ సంద‌ర్భంగా అమ్మ‌డికి పాకిస్తాన్ పేస్ బౌల‌ర్ న‌షీమ్ షా ఓ ఇంట‌ర్వ్యూలో షాక్ ఇచ్చాడు. న‌షీమ్ షాని ఊర్వ‌శి గురించి ప్ర‌శ్నించ‌గా ఆమె ఎవ‌రో నాకు తెలియ‌దంటూ దిమ్మ‌తిరిగే స‌మాధానం ఇచ్చాడు.

`` ఈ ప్ర‌శ్న‌కి నాకు న‌వ్వొస్తుంది. ఊర్వ‌శి ఎవ‌రో నాకు తెలియ‌దు. ప్రస్తుతం దృష్టంతా మ్యాచ్ పైనే ఉంది. అభిమానుల‌కు నాకు చాలా వీడియోలు పంపిస్తుంటారు. వాటి గురించి పెద్ద‌గా ప‌ట్టించుకోను. నా లో అంత ప్ర‌త్యేక‌త ఏమీ లేదు. కానీ క్రికెట్ అభిమానులంద‌రికీ ధ‌న్య‌వాదాలు` అని తెలిపారు.

మ‌రి నిజంగా ఊర్వ‌శి ఎవ‌రో న‌షీమ్ కి తెలియ‌దా? అంటే వివ‌రాల్లోకి వెళ్లాల్సిందే. ఆసియాక‌ప్ సూప‌ర్ -4 లో భాగంగా దుబాయ్ వేదిక‌గా భార‌త్-పాకిస్తాన్ మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్ చూడ‌టానికి ఊర్వ‌శి స్టేడియంకి వ‌చ్చింది. ఓసంద‌ర్భంలో న‌షీమ్-ఊర్వ‌శి మ‌ధ్య ఐకాంటాక్ట్ కుదిరింది. ఆ దృశ్యాల్ని కెమెరా మ్యాన్ రికార్డు చేసాడు. ఆ దృశ్యాన్ని ఇన్ స్టా గ్రామ్ లో ఓ రీల్ చేసి సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది ఊర్వ‌శి.

అది చూసిన నెటి జ‌నులు ఓ రేంజ్ లో ట్రోల్ చేసారు. ఆ రీల్ ని ఉద్దేశించే నేటి ఇంట‌ర్వ్యూలో న‌షీమ్ ని ఊర్వ‌శి గురించి అడిగారు. కానీ ఆయ‌నేమో తెలియ‌ద‌నే స‌రికి ఊర్వ‌శి గాలి తీసేసిన‌ట్లు అయింది. ఈ సంద‌ర్భంగా ఊర్వశి సైతం రిప్లై ఇచ్చింది. ``కొన్ని రోజుల కింద‌ట ఈ రీల్ లో ఎవ‌రు ఉన్నార‌నే విష‌యం తెలియ‌కుండా అభిమానులు చేసిన వీడియోని నా టీమ్ షేర్ చేసింది. ద‌య‌చేసి ఇలాంటి వ‌దంతులు సృష్టించొద్దు`` అంటూ ఊర్వ‌శి మ్యానేజ్ చేసే ప్ర‌యత్నం చేసింది.

దానికి సంబంధించిన రీల్ ని కూడా కాసేప‌టికి తొల‌గించింది. మ‌రి నిజంగా ఆ ప‌నులు త‌న‌కు తెలియ‌కుండా అభిమానులే చేస్తున్నారా? తానే అలాంటి ప్ర‌య‌త్నాల‌కు పూనుకుంటుందా? అన్న‌ది క్లారిటీ లేదు. ఏది ఏమైనా అమ్మ‌డి వ్య‌వ‌హారం మాత్రం అనుమాన‌దాస్ప‌దంగానే క‌నిపిస్తుంద‌ని నెటి జ‌నులు కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.