Begin typing your search above and press return to search.

ఆస్కార్ అవార్డులు కూడా టుమ్రీలే

By:  Tupaki Desk   |   1 Oct 2017 4:27 AM GMT
ఆస్కార్ అవార్డులు కూడా టుమ్రీలే
X
ఆస్కార్ అవార్డులంటే అత్యంత ప్రతిష్టాత్మకం. ప్రపంచం మొత్తంలో ప్రతీ దేశంలోని నటులు.. సాంకేతిక నిపుణులు కనే కల.. వారి అతి పెద్ద లక్ష్యం.. జీవిత కాలంలో ఒక్కసారైనా ఆస్కార్ అవార్డ్ అందుకోవడమే. ప్రపంచంలో అత్యధికంగా వీక్షించే.. ఎదురు చూసే సినిమా పండుగ కూడా ఆస్కార్ అవార్డులే ఒక్కసారి ఆ అవార్డ్ అందుకుంటే.. ఆ వ్యక్తి జీవితానికి పరమార్ధం చేకూరినట్లే.

ఇదీ ఇప్పటివరకూ మనకు ఆస్కార్ పై ఉన్న అభిప్రాయం. కానీ వీటిన్నిటినీ చిటికెలో తుంచేశారు బాలీవుడ్ సీనియర్ నటుడు నసీరుద్దీన్ షా. దేశం గర్వించదగ్గ నటుల్లో ఒకరైన ఆయన.. తాజాగా ఆస్కార్ లపై మండిపడ్డారు. అవేమీ అత్యుత్తమ అవార్డులు కాదని.. మన దేశంలో ఇచ్చే అతి సాధారణమైన అవార్డుల లాంటివేనని చెప్పారాయన. అనేక ఛానళ్లు.. సంస్థలు నిర్వహిస్తున్న మసాలా అవార్డుల మాదిరివే అన్నవి ఆయన వాదన. ఒక్క మాటలో చెప్పాలంటే ఎవరో ఏదో లక్ష్యం కోసం నిర్వహించే టుమ్రీ అవార్డుల టైపులోవే ఆస్కార్ లు కూడా అన్నారు నసీరుద్దీన్ షా.

"మన దేశంలో పలు ఛానల్స్ ఇచ్చే బోగస్ మసాలా అవార్డుల మాదిరివే ఆస్కార్ లు కూడా. అవి కూడా ఫేక్ అంతే. జనాలు ఇంతగా చెప్పుకునే సరికి గొప్పవని అనుకుటుంన్నాం. ఆ ఏడాదికి సంబంధించిన ఉత్తమ సినిమాలను.. యాక్టర్లను ఎంపిక చేయడానికి వారికి ఉన్న అర్హతలు.. పరిజ్ఞానం ఏంటి" అని నిలదీశారు నసీరుద్దీన్ షా.