Begin typing your search above and press return to search.
30 ఏళ్ల స్నేహంలో చిరుతో ఒకే సినిమా
By: Tupaki Desk | 10 March 2017 5:14 AM GMTకేరక్టర్ ఆర్టిస్ట్ గా నాజర్ ఎంతటి ఫేమస్ అనే సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సీరియస్ రోల్స్ నుంచి కామెడీ పాత్రల వరకూ.. కేరక్టర్ ఆర్టిస్ట్ నుంచి లీడ్ విలన్ వరకూ ప్రతీ కేరక్టర్ ను అద్భుతంగా పండిచేస్తారీయన. నాజర్ కు మెగాస్టార్ చిరంజీవి బెస్ట్ ఫ్రెండ్ అనే విషయం అతి తక్కువ మందికే తెలుసు.
సినిమాల కోసం చెన్నైలో ఉన్నప్పటి నుంచే చిరు.. నాజర్ లు స్నేహితులు. తాము బాక్స్ లు పంచుకుని తినే వాళ్లం అంటూ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు నాజర్. 'అప్పట్లో నేను చెంగల్పట్ నుంచి ట్రైన్ లో వచ్చేవాడిని. ఉదయాన్నే ఆరు గంటల లోపే నా ప్రయాణం మొదలవడంతో.. వచ్చేటపుడు ప్లెయిన్ రైస్ మాత్రం తెచ్చుకునేవాడిని. చిరంజీవి.. హరిప్రసాద్ వంటివారంతా దగ్గర్లో రూమ్ తీసుకుని ఉండేవాళ్లు. తెలుగు నటులందరికీ ఓ క్యారేజ్ బాక్స్ వచ్చేది. వాళ్ల దగ్గర కూరలు.. సాంబార్ తీసుకుని తినే వాడిని' అంటూ అప్పటి రోజులను గుర్తు చేసుకున్న నాజర్.. ఓ ఆశ్చర్యకరమైన విషయాన్ని బయటకు చెప్పారు.
'ఇలా ఎందుకు జరిగిందో తెలీదు కానీ.. మెగాస్టార్ చిరంజీవితో కలిసి నేను ఇప్పటివరకూ సినిమా చేయలేదు. తాజాగా ఖైదీ నంబర్ 150లో మాత్రం నటించాను. నేను చేసింది ఒక్క రోజు షూటింగ్ మాత్రమే అయినా.. అది 100 సినిమాలకు సమానంగా భావిస్తున్నాను. ఇలా ఎలా జరిగింది నాజర్ అంటూ చిరంజీవి కూడా ఆశ్చర్యపోయారు' అని చెప్పారు నాజర్.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/