Begin typing your search above and press return to search.

రణ్ బీర్ కి షాకిచ్చిన హాలీవుడ్ బ్యూటీ

By:  Tupaki Desk   |   23 Aug 2016 10:17 AM GMT
రణ్ బీర్ కి షాకిచ్చిన హాలీవుడ్ బ్యూటీ
X
ఎవరి స్థాయిలో వారు సొంతూరిలో సూపర్ సూపర్ అనుకుని మురిసిపోతుంటారు కానీ.. పక్క ఊరు వెళ్లినప్పుడు కదా తెలిసేది.. అనేది ఊర్లలో నానుడి. అలాగే అనుకోవాలో లేక మరోలా భావించాలో తెలియదు కానీ... బాలీవుడ్ యువ హీరో రణ్ బీర్ కపూర్ కు కొన్ని చేదు అనుభవాలు ఎదురయ్యాయి. బాలీవుడ్ లో లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న ఇతడికి దేశంలోని అమ్మాయిలు పడిచస్తారని అనుకోవచ్చు. ఎందుకంటే.. అతడు ఈ దేశంలో జనాలకు తెలిసిన సినిమా హీరో కాబట్టి. అయితే వేరే దేశాల్లో జనాలకు ఎలా తెలుస్తుంది చెప్పండి. అవును.. తెలియదు.. అనే విషయం రణ్ బీర్ కి తాజాగా తెలిసింది.

తాజాగా సీ.ఎఎ.ఎన్ న్యూస్ 18కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రణ్ బీర్ తన హలీవుడ్ చేదు అనుభవాలను చెప్పాడు. "ట్రిబెకా" చిత్రోత్సవంలో ఆస్కార్ అవార్డు విజేత - హాలీవుడ్ నటి నటాలీ పోర్ట్ మన్ ఫోన్ లో మాట్లాడుతూ ఏడుస్తున్నట్టు కనిపించేసరికి.. వెనుక రణ్ బీరి తెగ పరిగెత్తాడట. తాను అభిమానించే నటిని అభినందించాలని ఆమె దగ్గరకు చేరుకుని "ఐ లవ్ యువర్..." అని మాట పూర్తిచేసే లోపే ఆమె తలతిప్పి చూసి కోపంగా "గెట్ లాస్ట్" అని అరిచిందట. అంతే.. అనుకోని ఆ పరిస్థితికి రణ్ బీర్ హృదయం ఒక్క క్షణంలో ముక్కలైపోయిందట. ఆ చేదు క్షణాలు ఇంకా తనను వెంటాడుతూనే ఉన్నాయని చెబుతున్నాడు రణ్ బీర్. ఇంతకూ... రణ్ బీర్ ఆమెతో చెప్పాలనుకున్న పూర్తి వాక్యం ఏమిటంటే... "ఐ లవ్ యువర్ వర్క్" అని. ఆ మాట పూర్తిగా వినకుండానే ఆమె అలా ఫైరయిపోయిందట.

ఈమెతో ఇలాంటి అనుభవం ఉంటే.. ఒక హాలీవుడ్ దర్శకుడు తో మరోరకం అనుభవం ఎదురయ్యిందంట రణ్ బీర్ కపూర్ కి. "యే దిల్ హై ముష్కిల్" సినిమా షూటింగ్ సందర్భంగా ప్రముఖ హాలీవుడ్ డైరెక్టర్ క్వింటిన్ టారంటినో ను కలిసి ఫొటో దిగాలని తెగ ఉబలాట పడిన రణ్ బీర్ ఆ డైరెక్టర్ వెంట పరుగెత్తుకుంటూ వెళ్లినా... తనను పట్టించుకోకుండానే ఆయన కారెక్కి వెళ్లిపోయాడట. దీంతో నచ్చిన దర్శకుడితో ఫోటో దిగాలని ప్రయత్నించిన కష్టం అంతా బూడిదలో పోసిన పన్నీరయిపోయిందని తెగ బాదపడుతున్నాడు. ఈ స్థాయిలో మన బాలీవుడ్ లవర్ బాయ్ కి హాలివుడ్ స్టార్స్ తో చేదు అనుభవాలు ఎదురయ్యాయి.