Begin typing your search above and press return to search.
ఇలా మన హీరోయిన్లు చేయగలరా?
By: Tupaki Desk | 21 April 2018 6:31 AM GMTనటనలో కొనసాగుతున్న ఎవరు అయినా కీర్తి ప్రతిష్టలనే మొదటగా కోరుకుంటారు. అవి ఉంటే దక్కాల్సిన గౌరవం.. రావాల్సిన డబ్బు వంటివి ఆటోమేటిగ్గా వచ్చేస్తాయి. అలాంటిది తమ దేశ ప్రభుత్వమే సత్కరించేందుకు ఓ ఈవెంట్ నిర్వహిస్తానంటే.. ఆ కార్యక్రమాన్ని బహిష్కరించే తెగువ ఎవరికైనా ఉంటుందా?
ఆస్కార్ విన్నర్ నటాలీ పోర్ట్ మ్యాన్ ను సత్కరించేందుకు ఇజ్రాయిల్ ప్రభుత్వం నిర్ణయించింది. పవిత్ర ప్రాంతం అయిన జెరూసలేం లో ఈమెకు సన్మానం చేయాలని నిర్ణయించారు. కానీ ఈ కార్యక్రమానికి తాను హాజరు కాబోవడం లేదని.. తనకు ఈ సన్మానం వద్దని పోర్ట్ మ్యాన్ వెల్లడించింది. ఇందుకు కారణం.. ప్రస్తుతం గాజా సరిహద్దు వద్ద నెలకొన్ని ఉద్రిక్త పరిస్థితి. ఈమె తీసుకున్న నిర్ణయాన్ని పలువురు తప్పు పడుతున్నారు. దీంతో తాను ఈ అవార్డును ఎందుకు వద్దని చెబుతోందో వివరణ ఇచ్చింది నటాలీ పోర్ట్ మ్యాన్.
సరిహద్దు రేఖ వద్ద 11 మంది నిరాయుధులను నిర్దాక్షిణ్యంగా మంటల్లో కాల్చివేయడం అనే ఘటన తనను కలచివేసిందని.. సుదీర్ఘంగా ఉన్న ఈ సమస్యపై ప్రభుత్వం ఇలా స్పందించడం సరికాదని అభిప్రాయపడ్డ పోర్ట్ మ్యాన్.. ప్రజల దృష్టి మరలించేందుకు తాను పావును కావడం ఇష్టం లేకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నాని చెప్పింది. ఘన సత్కారాన్ని కాదనుకుని.. ఇంతటి ఘనమైన నిర్ణయం తీసుకునే తెగువ.. మన హీరోయిన్లలో ఏ ఒక్కరికి అయినా ఉంటుందా?