Begin typing your search above and press return to search.
ఆర్జీవీ శిష్యుడు మూర్ఖుడు.. స్వార్థపరుడు.. అవివేకి!!
By: Tupaki Desk | 7 Jun 2020 5:08 AM GMTసున్నిత ఉద్వేగాల్ని నేచురాలిటీని తెరపై అందంగా చూపించడం శేఖర్ కమ్ముల విధానం. కానీ అందుకు పూర్తి భిన్నంగా ఆలోచించే దర్శకుడు అనురాగ్ కశ్యప్. హార్డ్ హిట్టింగ్ కంటెంట్ ఆయన సినిమాలకు ప్రధాన ఆయుధం. గ్యాంగ్స్ ఆఫ్ వాస్సేపూర్- రామన్ రాఘవ్- బ్లాక్ ఫ్రైడే- అగ్లీ .. మరెన్నో హార్డ్-హిట్టింగ్ సినిమాల్ని బాలీవుడ్ లో తెరకెక్కించి ప్రశంసలు అందుకున్నారు ఆయన.
అనురాగ్.... ది గ్రేట్ రామ్ గోపాల్ వర్మ శిష్యుడు అన్న సంగతి తెలిసిందే. ఆరంభం సత్య సినిమాకి సహరచయితగా పని చేశాడు అనురాగ్. ఆ తర్వాత ఆర్జీవీ తెరకెక్కించిన పలు చిత్రాలకు అసిస్టెంట్ గా పని చేశాడు. తాజాగా ఆయనపై ఓ కొలీగ్ చేసిన ఆరోపణ సంచలనంగా మారింది.
అప్పట్లో `బ్లాక్ ఫ్రైడే` మూవీ కోసం అనురాగ్ తో పాటు కలిసి పనిచేసిన సినిమాటోగ్రాఫర్ నటరాజన్ సుబ్రమణ్యం (నాటీ అని పిలుస్తారు) అనురాగ్ ను మూర్ఖుడు స్వార్థపరుడు అని తిట్టేశారు. ఆయన వరుస ట్వీట్లలో ఒకరకంగా నిప్పులే చెరిగాడు. ఏరు దాటాక తెప్ప తగలేసే రకం అనురాగ్ కశ్యప్.. నన్ను మరచిపోయాడు అంటూ చెలరేగాడు.
``అనురాగ్ కశ్యప్ `సత్య` మూవీ రచయితలలో ఒకరు. `పాంచ్` స్క్రిప్ట్ తో వచ్చి మమ్మల్ని కలిశాడు. అప్పట్లో నాదగ్గర డబ్బులు లేకపోయనా అతనికి మద్దతునిచ్చాను ... మహాకాళీ చివరి ప్రయాణం.. నాకు ఏదీ లాభించలేదు. నేను చేసిన అన్ని పనులు అతని కోసమే.. కానీ స్నేహితులందరినీ తన సర్కిల్ కు దూరంగా ఉంచాడు ... కెరీర్ పరంగా అతడికి ఒకరకమైన సాయం చేశాను. బ్లాక్ ఫ్రైడే చిత్రం కోసం ప్రతి ఒక్కరూ చాలా కష్టపడ్డారు. కానీ కాలక్రమంలో అనురాగ్ నన్ను మరచిపోయాడు. పైగా నాపై అర్ధం పర్థం లేని మాటలు మాట్లాడుతున్నాడు .. అతనితో సంబంధం ఉన్న ఇతరులను అడగండి ... అతను మూర్ఖుడు`` అంటూ చెడామడా తిట్టేశాడు.
అనురాగ్ అవకాశవాది. స్వార్థపరుడు.. అవివేకి.. మూర్ఖుడు అనేశారు ఆయన. నేను ఒక స్వార్థపరుడి గురించి మాట్లాడాను అని కాస్త తీవ్రమైన వ్యాఖ్యలే చేశారు నటరాజన్. నా గుండెల్లో దాగిన నిజాల్ని చెప్పాను!! అని సుదీర్ఘంగానే ట్వీట్ల దాడి చేశాడు నటరాజన్. మొత్తానికి స్నేహితుల మధ్య పెద్ద అగాధం ఏర్పడిందని ఈ మాటల్ని బట్టి అర్థమవుతోంది. తాను పెద్ద దర్శకుడు అయ్యాక స్నేహితులకు అనురాగ్ ఎలాంటి సాయం చేయలేదా? స్వార్థపరుడయ్యాడా? దీనికి ఆయనేం సమాధానమిస్తారో?