Begin typing your search above and press return to search.

ఫోటోస్టోరి: వీపు సొగ‌సు చూడ‌త‌ర‌మా సుంద‌రీ

By:  Tupaki Desk   |   21 April 2021 12:30 AM GMT
ఫోటోస్టోరి: వీపు సొగ‌సు చూడ‌త‌ర‌మా సుంద‌రీ
X
ఆర్జీవీ డిస్క‌వ‌రీ న‌థాలియా కౌర్ ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. పంజాబ్ మూలాలున్న బ్రెజిలియ‌న్ మోడ‌ల్ గా న‌థాలియా సుప‌రిచితం. ఈ బ్యూటీ బాలీవుడ్ లో అడుగుపెట్టినా కానీ ఎందుక‌నో సక్సెస్ కాలేక‌పోయింది. టాప్ మోడ‌ల్ గా రాణిస్తూనే స్పెష‌ల్ నంబ‌ర్ల‌లో న‌ర్తించిన ఈ బ్యూటీ క‌థానాయిక‌గా ప్ర‌య‌త్నించినా ఎవ‌రూ అవ‌కాశాలివ్వ‌లేదు.

న‌థాలియా కెరీర్ లో ఆర్జీవీ డిపార్ట్ మెంట్ మిన‌హా చెప్పుకోద‌గ్గ ఆఫ‌ర్లు ఏవీ లేవు. ఇక ఇటీవ‌లి కాలంలో ఈ అమ్మ‌డు సోష‌ల్ మీడియాల్లో హ‌ద్దులు చెరిపేసి చెల‌రేగుతున్న తీరు యువ‌త‌రంలో హాట్ టాపిక్ గా మారింది. న‌థాలియా నిరంత‌రం బికినీ బీచ్ సెల‌బ్రేష‌న్స్ తో చిల్ చేసే ఫోటోల‌ను.. బోల్డ్ ఫోటోషూట్ల‌ను ఇన్ స్టాలో షేర్ చేస్తుంటే అవి వైర‌ల్ గా మారుతున్నాయి.

తాజాగా ఈ హాట్ కిల్ల‌ర్ బ్యూటీ వీపందం ప్ర‌ద‌ర్శిస్తున్న ఫోటోలు వైర‌ల్ గా మారాయి. బ్లూ ఫ్లోర‌ల్ బికినీలో న‌థాలియా ఫోజులిచ్చింది. అలా సైడ్ లుక్ లో కిక్ పెంచింది. మ‌రోసారి తెలుగు ఇండ‌స్ట్రీలోనూ అవ‌కాశాల కోసం న‌థాలియా ట్రై చేస్తోంద‌ట‌.