Begin typing your search above and press return to search.
జాతీయ అవార్డుతో చెంప దెబ్బ.. అదీ డైరెక్టర్ స్టైల్!
By: Tupaki Desk | 29 Sep 2021 11:30 PM GMTబాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ మధుర్ భండార్కర్ కెరీర్ లో సాధించిన సంచలన విజయాల గురించి చెప్పాల్సిన పనిలేదు. `రంగీలా`..`చాందీని బార్`..`ఫ్యాషన్`..`హీరోయిన్` వంటి చిత్రాలతో బాలీవుడ్ లో తనదైన మార్క్ వేసారు. చాందినీబార్ తో జాతీయ అవార్డుని సైతం దక్కించుకుని తనకంటూ ఓ బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నారు. టబు ప్రధాన పాత్రలో నటించగా అతుల్ కులకర్ణి.. రాజ్ పాల్ యాదవ్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఇది క్రైమ్-మాఫియా నేపథ్యంలో సాగే చిత్రం. ముంబైలో బార్లు..పడుపు వృత్తి..డాన్సర్ల జీవితాల్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కించారు. అప్పట్లో ఈ సినిమా ఊహించని విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో మధురా భండార్కర్ మంచి పేరొచ్చింది. విమర్శించిన వాళ్లే ఆ తర్వాత ఆయన ట్యాలెంట్ ని మెచ్చుకుని నెత్తిన పెట్టుకున్నారు.
సరిగ్గా `చాందినీ బార్` రిలీజ్ అయి సెప్టెంబర్ 28వ తో రెండు దశాబ్ధాలు పూర్తయింది. ఈ సందర్భంగా ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికర సంగతుల్ని మధురా పంచుకున్నారు. ఈ కథని కేవలం టబుని దృష్టిలో పెట్టుకునే రాసుకున్నారుట. అప్పటికే ఆమె కమర్శియల్ హీరోయిన్ గా దూసుకుపోతుంది. ఆమె ఒప్పుకుంటుందా? లేదా? అని చిన్న బెణుకు ఉండేది. కానీ టబు స్క్రిప్ట్ విన్న వెంటనే ఒప్పుకుంది. ఒకవేళ ఒప్పుకోకపోతే నాకు ప్రత్నామ్నాయం కూడా లేదు. ఆమె ఒప్పుకోవడం చాలా ఆనందాన్ని ఇచ్చిందన్నారు. ఈ సినిమాకు అప్పట్లో 1.5 కోట్లు ఖర్చయింది. ఆ తర్వాత ఇటీవలే కరీనా కపూర్ తో `హీరోయిన్` చిత్రాన్ని తీసాను.
ఈ సినిమా లో హీరోయిన్ కాస్ట్యూమ్స్ ఖర్చు చాందినీ బార్ ఖర్చు కంటే ఎక్కువ అయింది. `దీనికి కారణం కరీనా` అంటూ ఆమెని ఆటపట్టిస్తాను అని మధుర్ భండార్కర్ అన్నారు. `చాందినీ బార్` రిలీజ్ సమయంలో....టైటిల్ పై కొంత వివాదం ఏర్పడింది. చాలా మంది అందులో కంటెంట్ అర్ధం తెలియకుండానే బీ గ్రేడ్ సినిమా అన్నారు. కానీ ఆ తర్వాత ఆ సినిమాకు జాతీయ అవార్డు తో చెంప పెట్టు లాంటి సమాధానం అందరికీ దొరికింది అనిపించిందన్నారు. ప్రస్తుతం ఆయన `ఇండియా లాక్ డౌన్` అనే సినిమాని తెరకెక్కిస్తున్నారు.