Begin typing your search above and press return to search.

జాతీయ అవార్డు గ్రహీత క్రేజీ త్రిభాషా చిత్రం

By:  Tupaki Desk   |   5 Nov 2020 6:15 AM GMT
జాతీయ అవార్డు గ్రహీత క్రేజీ త్రిభాషా చిత్రం
X
జాతీయ అవార్డు గ్రహీత.. తమిళ నటుడు బాబీ సింహా తదుపరి తమిళం-తెలుగు ద్విభాషా చిత్రంలో కనిపించనున్నారు. ఇంకా టైటిల్ నిర్ణ‌యించ‌ని ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ టైటిల్ రేపు రాత్రి 7 గంటలకు విడుదల అవుతుంది.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. తెలుగు- తమిళ -కన్నడ (డ‌బ్ చేస్తారు) భాషల‌లో ఈ లాంచింగ్ కోసం వరుసగా మూడు భాష‌ల్లో ముగ్గురు ప్రముఖ హీరోలు సిద్ధ‌మ‌వుతున్నారు. తెలుగులో రానా దగ్గుబాటి...త‌మిళంలో ధనుష్ .. క‌న్న‌డ‌లో శాండల్ వుడ్ స్టార్ రక్షిత్ శెట్టి ఈ టైటిల్ పోస్ట‌ర్ ని రిలీజ్ చేస్తారు.

ఈ చిత్రానికి తెలుగు ప్రొడక్షన్ హౌస్ ఎస్ఆర్‌.టి ఎంటర్ టైన్ మెంట్స్ - ముద్ర ఫిల్మ్ ఫ్యాక్టరీ నిర్మిస్తుండ‌గా. రమణన్ పురుషోత్త‌మ ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం కానున్నారు. బాలీవుడ్ హాట్ గాళ్ క‌శ్మీరా పార్దేసి క‌థానాయిక‌గా న‌టించనుంది.