Begin typing your search above and press return to search.

నెక్స్ట్ ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేయలేకపోయిన నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్..?

By:  Tupaki Desk   |   16 Jan 2021 2:30 AM GMT
నెక్స్ట్ ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేయలేకపోయిన నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్..?
X

'LBW' సినిమాతో డైరెక్టర్ గా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ప్రవీణ్ సత్తారు.. 'రొటీన్ లవ్ స్టోరీ' 'చందమామ కథలు' 'గుంటూరు టాకీస్' 'PSV గరుడవేగ' చిత్రాలతో టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. 'చందమామ కథలు' సినిమాతో నేషనల్ అవార్డ్ అందుకున్న ప్రవీణ్ సత్తారు.. మంచి కంటెంట్ తో సినిమాలు తీయగలడని నిరూపించుకున్నాడు. అలాంటి టాలెంటెడ్ డైరెక్టర్.. 2017లో 'పీఎస్వీ గరుడవేగ' సినిమా తర్వాత మరో సినిమా ప్రేక్షకులకు అందించలేకపోయాడు. నిజానికి బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్ జీవిత కథ ఆధారంగా సుధీర్ బాబు టైటిల్ రోల్ లో ప్రవీణ్ సత్తారు సినిమా చేయాలనుకున్నారు. అయితే ఆ ప్రాజెక్ట్ లేట్ అవుతూ వచ్చింది. దీంతో ప్రవీణ్ ప్రస్తుతానికి దాన్ని ఒక్కన పెట్టి మరో స్టోరీపై ఫోకస్ పెట్టాడు.

టాలీవుడ్ సీనియర్ హీరోల్లో ఒకరైన అక్కినేని నాగార్జునని డైరెక్ట్ చేసే అవకాశం దక్కించుకున్నాడు. సోనాలి నారంగ్ సమర్పణలో నారాయణదాస్ కె నారంగ్ - రామ్మోహనరావు కలిసి ఈ చిత్రాన్ని నిర్ణయించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇది అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలో వచ్చిన 'రెయిడ్' సినిమాకి రీమేక్ అనే వార్తలు కూడా వచ్చాయి. అయితే ఇది సొంతంగా రెడీ చేసుకున్న కథ అని ప్రవీణ్ సత్తారు క్లారిటీ ఇచ్చాడు.  ప్రస్తుతం నాగ్ నటిస్తున్న కాప్ డ్రామా 'వైల్డ్ డాగ్' పుర్టైన వెంటనే ప్రవీణ్ కాంబోలో మూవీ స్టార్ట్ అవుతుందని అందరూ అనుకున్నారు. అయితే ఇంతవరకు ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందనే దానిపై స్పష్టత రాలేదు. దీంతో నాగ్ - ప్రవీణ్ కాంబోపై అనేక రూమర్స్ వస్తున్నాయి. ప్రవీణ్ చెప్పిన స్టోరీ లైన్ నచ్చిన నాగార్జున.. కంప్లీట్ స్క్రిప్ట్ రెడీ చేయమని చెప్పాడట. అయితే ప్రవీణ్ రెడీ చేసిన పూర్తి స్క్రిప్ట్ నాగ్ ని మెప్పించలేకపోయిందట. ఇప్పటికే మూడేళ్ళ నుంచి నెక్స్ట్ సినిమాని స్టార్ట్ చేయాలని చూస్తున్న ప్రవీణ్ సత్తారు మరికొంత కాలం వెయిట్ చేయాల్సి వచ్చిందని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.