Begin typing your search above and press return to search.

నమ్మకంను కోల్పోతున్న జాతీయ అవార్డులు

By:  Tupaki Desk   |   24 March 2021 5:30 AM GMT
నమ్మకంను కోల్పోతున్న జాతీయ అవార్డులు
X
ఇటీవల ప్రకటించిన 67వ జాతీయ అవార్డుల జ్యూరీపై విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. ప్రతిభవంతులను పక్కన పెట్టారు అనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా ఉత్తమ సంగీత దర్శకుడిగా విశ్వాసం సినిమాకు ఇమాన్‌ కు ఇవ్వడం విడ్డూరంగా ఉంది. ఒకప్పుడు జాతీయ అవార్డులు అంటే ప్రతిభ కనబర్చిన వారికి ఆర్ట్‌ ఫిల్మ్‌ తీసిన వారికి మంచి కంటెంట్ ను చూపించిన వారికి మాత్రమే ఇచ్చే వారు. కాని ఇప్పుడు మాత్రం కమర్షియల్‌ సినిమాలకు పెద్ద పీట వేయడం విడ్డూరంగా ఉందంటూ విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై ప్రతి ఒక్కరు కూడా సోషల్‌ మీడియాలో విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. తెలుగులో మహర్షి సినిమాకు రెండు అవార్డులు రావడం పట్ల కూడా సోషల్‌ మీడియాలో జోకులు పేలుతున్నాయి.

మహేష్‌ బాబు సినిమా కు ఉత్తమ కొరియోగ్రాఫర్‌ అవార్డు రావడం విడ్డూరంగా ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మోడీ సర్కారుకు అనుకూలంగా ఉండటం వల్ల కూడా కొందరు అవార్డులను దక్కించుకున్నారు అనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. సినిమా పరిశ్రమను రాజకీయాలతో ముడి పెట్టడం ఏమాత్రం సబబు కాదంటూ సినీ ప్రేమికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సూపర్‌ 30 సినిమా లో హృతిక్ రోషన్ నటించిన తీరు ఖచ్చితంగా జాతీయ అవార్డుకు అర్హుడు అన్నట్లుగా ఉంది. కాని ఆ సినిమాకు అవార్డులు ఏమీ రాకపోవడం రాజకీయమే అంటున్నారు.

కంగనా మంచి నటి అయినా కూడా ఆమె రెండు సినిమాలకు ఉత్తమ నటిగా ఎంపిక అవ్వడం విచిత్రం అంటూ నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు. ఇంకా పలు విభాగాల్లో అవార్డులు అందుకున్న వారు గొప్ప టెక్నిషియన్స్ అయ్యి ఉండవచ్చు కాని వారికంటే ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారిని పక్కకు పెట్టారు అనే విమర్శలు మాత్రం జోరుగా వినిపిస్తున్నాయి. ప్రతి సారి అవార్డులు ప్రకటించిన సమయంలో ఇలాంటివి కామన్ అంటూ మరి కొందరు లైట్ తీసుకుంటున్నారు. ఇదే కొనసాగితే గల్లీ అవార్డుల మాదిరిగా జాతీయ అవార్డులు కూడా నమ్మకంను కోల్పోతాయని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.