Begin typing your search above and press return to search.
ఆన్ లైన్ ఫ్రాడ్స్ పై జాతీయ ఉత్తమ నటి సందేశం
By: Tupaki Desk | 13 Dec 2022 1:30 PM GMTఆన్ లైన్ మోసాలు నేడు అమాంతంగా పెరిగిపోయాయి. ఆర్థిక అవసరాల్లో ఉన్నవారే ఇలాంటి మోసగాళ్ల టార్గెట్. రుణం ఆశతో లాటరీల పేరుతో ఆన్ లైన్ వలలో చిక్కుకుంటున్న ప్రజల గురించి.. డబ్బాశ పేరాశతో మోసపోతున్న అమాయక ప్రజల గురించి నిరంతరం కథనాలొస్తున్నాయి. మొన్నటికి మొన్న గుంటూరు యువతి 16లక్షల మేర మోసానికి గురవ్వడం సంచలనమైంది.
కిడ్నీరాకెట్ కి ఆన్ లైన్ ట్రాన్స్ ఫర్లు చేసిన సదరు ఇంటర్మీడియట్ అమ్మాయి రాకెట్ సభ్యులను కలిసేందుకు ఇంట్లో చెప్పకుండా ఢిల్లీ వెళ్లి మరీ వచ్చింది. చివరకు తాను మోసపోయానని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కోటి రూపాయలకు ఆశపడి తన కిడ్నీని అమ్ముకునేందుకు ఈ టీనేజీ గాళ్ సిద్ధమైందంటే సన్నివేశాన్ని అర్థం చేసుకోవాలి. యువతి ఆశను సొమ్ము చేసుకున్న ఆన్ లైన్ మోసగాళ్లపై ఇప్పుడు పోలీస్ ఇన్వెస్టిగేషన్ సాగుతోంది.
ఇది కేవలం ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. ఇలాంటి సైబర్ నేరాలు కోకొల్లలు. సైబర్ క్రైమ్ కి ఊపిరాడనంత పని ఉందిప్పుడు. అయితే ఇలా మోసపోయే వాళ్ల ఆలోచనలకు చెక్ పెట్టేందుకు సెలబ్రిటీ ప్రచారంతోను సైబర్ క్రైమ్ డిపార్ట్ మెంట్ ప్రయత్నిస్తోంది.
తాజాగా జాతీయ ఉత్తమ నటి టబు ఐసీఐసీఐ బ్యాంక్ రూపొందించిన ఇలాంటి ఒక ప్రకటనలో నటించారు. ఈ ప్రకటన ఇప్పుడు యూత్ లో హాట్ టాపిక్ గా మారింది.
10లక్షలు లాటరీ తగిలిందంటూ చీటర్ అమాయకుడికి వల వేస్తున్న తీరు ఈ వీడియోలో కనిపిస్తోంది. అక్కడ ఒక ఆన్ లైన్ చీటింగ్ టీమ్ ఎంతో నిబద్ధతతో ఎవరి పనిలో వారు ఉన్నారు. ఇంతలోనే ఆన్ లైన్ డెలివరీ గాళ్ రూపంలో టబు అక్కడ ప్రత్యక్షమయ్యారు. గుట్టుగా సాగుతున్న సైబర్ మోసగాళ్ల వ్యవహారం అంతా కనిపెట్టి అరెస్ట్ లు చేయిస్తుంది. సింపుల్ థీమ్ తో ఎంతో ఆకట్టుకునేలా ఉన్న ఈ ప్రకటన వైరల్ గా మారింది.
కెరీర్ మ్యాటర్ కి వస్తే టబు ఇటీవల తన వయసుకు తగ్గ హుందా అయిన పాత్రల్లో నటిస్తూ ఆకట్టుకుంటున్నారు. బాలీవుడ్ లో ఇటీవల విడుదలై విజయం సాధించిన దృశ్యం 2లో నటించారు.
తదుపరి టబు నటించిన మరో పాన్ ఇండియా మూవీ విడుదలకు వస్తోంది. ఈ చిత్రాన్ని విశాల్ భరద్వాజ్ లాంటి సీనియర్ దర్శకుడు తెరకెక్కించారు. కుట్టే పేరుతో రూపొందిన ఈ సినిమా పోస్టర్లు ఇప్పటికే ఆసక్తిని కలిగించాయి. అలాగే కూఫియా అనే మరో భారీ చిత్రంలోను టబు నటిస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.