Begin typing your search above and press return to search.

స్పై థ్రిల్ల‌ర్ లో జాతీయ ఉత్త‌మ న‌టి ట‌బు

By:  Tupaki Desk   |   17 Sep 2021 2:30 AM GMT
స్పై థ్రిల్ల‌ర్ లో జాతీయ ఉత్త‌మ న‌టి ట‌బు
X
వెట‌ర‌న్ న‌టి ట‌బు ఇటీవ‌ల‌ బిజీ న‌టిగా మారారు. ఇప్ప‌టికే బాలీవుడ్ చిత్రాల‌తో బిజీగా ఉన్న జాతీయ ఉత్త‌మ న‌టి ట‌బు `అల‌వైకుంఠ‌పుర‌ములో` సినిమాతో టాలీవుడ్ లోనూ కంబ్యాక్ అయిన సంగ‌తి తెలిసిందే. ఇందులో ట‌బు పాత్ర‌కు మంచి పేరొచ్చింది. ఈ నేప‌థ్యంలో టాలీవుడ్ లోనూ బెస్ట్ రోల్స్ లో ఆఫ‌ర్స్ వ‌స్తున్నాయి. అటు వెబ్ సిరీస్ ల్లోనూ ట‌బు త‌న‌దైన మార్క్ వేస్తూ దూసుకుపోతున్నారు. ఇప్ప‌టికే `ఏ సూట‌బుల్ బోయ్ `వెబ్ సిరీస్ లో న‌టించారు. బీబీసీలో ప్ర‌సారమైన సిరీస్ కు మంచి ఆద‌ర‌ణ ద‌క్కింది. ఈ నేప‌థ్యంలో ట‌బు ప్ర‌ధాన పాత్ర‌లో నెట్ ఫ్లిక్స్ ఇండియా మ‌రో కొత్త సిరీస్ ని ప్ర‌క‌టించింది.

ఇది ఓ స్పై థ్రిల్ల‌ర్ కాన్సెప్ట్ తో రూపొందుతున్న‌ సిరీస్. అమ‌ర్ భూష‌ణ్ ర‌చించిన `ఎస్కేప్ టూ నోవేర్` అనే థ్రిల్ల‌ర్ న‌వ‌ల ఆధారంగా దీన్ని తెర‌కెక్కిస్తున్నారు. దీనికి `ఖుఫియా` అనే టైటిల్ ఖ‌రారు చేసారు. భార‌త‌దేశ ర‌క్ష‌ణ ర‌హ‌స్యాల్ని ఆధారంగా ఈ సిరీస్ సాగ‌నుంది. ఇది రా ఏజెంట్ కృష్ణ మెహ్రా క‌థ‌. ఈ సంద‌ర్భంగా ట‌బు సైతం ఎంతో ఎగ్జైటింగ్ గా విష‌యాన్ని అభిమానులు చేర వేసింది. ఇది అద్భుత‌మైన థ్రిల్ల‌ర్ సిరీస్. థ్రిల్ల‌ర్ లో క్యూరియాసిటీని మిన‌హా మ‌రేది ఆశించ‌వ‌ద్దు. ఈ విష‌యాన్ని ఎంతో థ్రిల్లింగ్ గానే అందరికీ షేర్ చేస్తున్న‌ట్లు వెల్ల‌డించారు ట‌బు. ఈ స్పై థ్రిల్ల‌ర్ కి విశాల్ భ‌ర‌ద్వాజ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

ఈ నెల‌ఖ‌రు నుంచి షూటింగ్ ప్రారంభం అవుతుంది. న్యూఢిల్లీలోనే మెయిన్ పార్ట్ షూటింగ్ అంతా సాగుతుంది. రా ఆప‌రేట‌ర్ క‌థ‌ల్లోనే చాలా భిన్నంగా సాగే స్టోరీ అని.. ప్ర‌తీ స‌న్నివేశం ఎంతో ఎగ్జైటింగ్ గా ఉంటుంద‌ని యూనిట్ తెలిపింది. ట‌బు తో పాటు అలీ జాఫ‌ర్.. వామికా గ‌బ్బి.. అశిష్ విద్యార్థి కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. ఇంకా అవ‌స‌ర‌మేర ఉత్త‌మ న‌టీన‌టుల్ని ఎంపిక చేస్తామ‌ని ద‌ర్శ‌కుడు తెలిపారు.