Begin typing your search above and press return to search.

2019 జాతీయ అవార్డుల్లో విక‌సించిన‌ టాలీవుడ్

By:  Tupaki Desk   |   9 Aug 2019 12:32 PM GMT
2019 జాతీయ అవార్డుల్లో విక‌సించిన‌ టాలీవుడ్
X
జాతీయ అవార్డుల ప్ర‌క‌ట‌న ఎప్పుడు? అంటూ ఇటీవ‌ల ఆస‌క్తిగా చ‌ర్చ సాగింది. ఇంత‌లోనే 66వ జాతీయ చలన చిత్ర అవార్డులను శుక్రవారం ప్రకటించారు. దేశ రాజధాని దిల్లీలో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో 2018లో దేశవ్యాప్తంగా విడుదలైన అన్ని భాషల చిత్రాల‌కు అవార్డుల విజేత‌ల్ని ప్ర‌క‌టించారు. కేంద్రం సమాచార - ప్రసారశాఖ మంత్రి ప్రకాశ్‌ జావడేకర్ .. జూరీ స‌భ్యుడు రాహుల్ రాలీతో క‌లిసి ఈ పుర‌స్కారాల వివ‌రాల్ని వెల్ల‌డించారు. ఈసారి తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి `మహానటి`.. `రంగస్థలం`.. అ!.. `చి.ల.సౌ` చిత్రాలకు అవార్డులు దక్కాయి. మునుప‌టితో పోలిస్తే తెలుగు సినిమా జాతీయ పుర‌స్కారాల్లో వికశించింద‌న్న ప్ర‌శంస‌లు వెల్లువెత్తుతున్నాయి.

తెలుగు సినిమా అవార్డుల వివరాల్ని ప‌రిశీలిస్తే.. మొత్తం ఏడు అవార్డులు టాలీవుడ్ గెలుచుకుంది. ఇందులో మూడు మ‌హాన‌టికి ద‌క్కాయి. మ‌హాన‌టికి జాతీయ ఉత్తమ తెలుగు చిత్రం పుర‌స్కారం ద‌క్కింది. ఈ చిత్రంలో సావిత్రి పాత్ర‌లో ప‌ర‌కాయం చేసిన కీర్తి సురేష్ కు జాతీయ ఉత్త‌మ న‌టిగా పుర‌స్కారం ద‌క్కింది. అలాగే మ‌హాన‌టి కి ఉత్త‌మ కాస్ట్యూమ్స్ డిజైన‌ర్ పుర‌స్కారం ద‌క్కింది. ఉత్తమ స్క్రీన్ ప్లే చిత్రంగా సుశాంత్- రాహుల్ ర‌వీంద్ర‌న్ కాంబినేష‌న్ మూవీ చి.ల‌.సౌ అవార్డును ద‌క్కించుకోవ‌డం ఆస‌క్తిక‌రం. ఉత్తమ స్పెషల్‌ ఎఫెక్ట్స్ విభాగంలో ప్ర‌శాంత్ వ‌ర్మ తెర‌కెక్కించిన `అ!` చిత్రానికి .. క‌న్న‌డ `కేజీఎఫ్‌`కి క‌లిపి అవార్డును పంచారు. ఉత్తమ మేకప్ విభాగంలోనూ `అ!` చిత్రం మెరిసింది. ఉత్తమ ఆడియోగ్రఫీ విభాగంలో రంగస్థలం (రాజా కృష్ణన్) చిత్రానికి పుర‌స్కారం ద‌క్కింది. ఇక సౌత్ నుంచి క‌న్న‌డ చిత్రం `కేజీఎఫ్‌`కి అవార్డులు ద‌క్కాయి. జాతీయ ఉత్తమ యాక్షన్‌ చలన చిత్రంగా కేజీఎఫ్ పుర‌స్కారం ద‌క్కించుకుంది. అలాగే ముందే ఊహించిన‌ట్టే ఊరి.. అంధాదున్.. ప‌ద్మావ‌త్ చిత్రాల‌కు జాతీయ పుర‌స్కారాలు ద‌క్కాయి.

జాతీయ అవార్డులు జాబితా:

* జాతీయ ఉత్తమ తెలుగు చిత్రం: మహానటి
* ఉత్తమ నటి: కీర్తి సురేశ్‌(మహానటి)
* ఉత్తమ కాస్ట్యూమ్స్‌ డిజైనర్‌: మహానటి
* ఉత్తమ స్క్రీన్ ప్లే చిత్రం: చి.ల.సౌ
* ఉత్తమ స్పెషల్‌ ఎఫెక్ట్స్‌: అ!(తెలుగు)- కేజీఎఫ్‌(కన్నడ)
* ఉత్తమ మేకప్‌: అ!
* ఉత్తమ ఆడియోగ్రఫీ: రంగస్థలం (రాజా కృష్ణన్)

* ఉత్తమ చిత్రం: హెల్లారో(గుజరాతీ)
* ఉత్తమ దర్శకుడు: ఆదిత్య ధర్‌(ఉరి)
* ఉత్తమ నటుడు: ఆయుష్మాన్‌ ఖురానా (అంధాధున్‌) - విక్కీ కౌశల్‌(ఉరి)
* ఉత్తమ సహాయ నటుడు: స్వానంద్‌ కిర్‌ కిరే(చంబక్‌)
* ఉత్తమ సహాయ నటి: సురేఖా సిక్రీ (బదాయ్‌ హో)
* ఉత్తమ పర్యావరణ పరిరక్షణ నేపథ్య చిత్రం: పానీ(మరాఠీ)
* ఉత్తమ సామాజిక చిత్రం: ప్యాడ్‌ మ్యాన్‌
* ఉత్తమ వినోదాత్మక చిత్రం: బదాయ్‌ హో
* ఉత్తమ పరిచయ దర్శకుడు: సుధాకర్‌ రెడ్డి యాకంటి(నాల్‌: మరాఠీ)
* జాతీయ ఉత్తమ హిందీ చిత్రం: అంధాధున్‌
* జాతీయ ఉత్తమ సినిమాటోగ్రఫీ: పద్మావత్‌
* జాతీయ ఉత్తమ ఉర్దూ చిత్రం: హమీద్‌
* ఉత్తమ సంగీత దర్శకుడు: సంజయ్‌ లీలా భన్సాలీ(పద్మావత్‌)
* జాతీయ ఉత్తమ యాక్షన్‌ చలన చిత్రం: కేజీఎఫ్‌
* ఉత్తమ సాహిత్యం: నాతిచరామి(కన్నడ)
* ఉత్తమ ప్రొడక్షన్‌ డిజైన్‌: కమ్మార సంభవం(మలయాళం)
* ఉత్తమ ఎడిటింగ్‌: నాతిచరామి(కన్నడ)
* ఉత్తమ సౌండ్‌ డిజైనింగ్‌: ఉరి
* ఉత్తమ అడాప్టెడ్‌ స్క్రీప్‌ ప్లే: అంధాధున్‌
* ఉత్తమ సంభాషణలు: తారీఖ్‌(బెంగాలీ)
* ఉత్తమ గాయని: బిందుమాలిని(నాతి చరామి: మాయావి మానవే)
* ఉత్తమ గాయకుడు: అర్జిత్‌ సింగ్‌(పద్మావత్‌: బింటే దిల్‌)
* ఉత్తమ బాల నటుడు: పీవీ రోహిత్‌ - షాహిబ్‌ సింగ్‌ - తలాహ్‌ అర్షద్‌ రేసి - శ్రీనివాస్‌ పోకాలే
* నర్గీస్‌ దత్‌ అవార్డు: వండల్లా ఎరడల్లా(కన్నడ)