Begin typing your search above and press return to search.
'మా' ఎన్నికల బరిలో నేషనల్ హీరో..??
By: Tupaki Desk | 8 July 2021 4:38 PM GMTతెలుగు సినిమా ఇండస్ట్రీలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎలక్షన్స్ ఈసారి రసవత్తరంగా మారుతున్నాయి. సెప్టెంబర్ నెలలో జరుగనున్న ఎన్నికల కోసం మూడు నెలల ముందుగానే ప్రచారం మొదలు పెట్టారు. పోటాపోటీగా ప్రెస్ మీట్లు పెట్టి ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు.. విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నారు. ఈ క్రమంలో 'మా' ఎలక్షన్స్ కు సంబంధించి మీడియాలో సోషల్ మీడియాలో అనేక ఊహాగానాలు రూమర్స్ వస్తున్నాయి. ఇప్పుడు తాజాగా రియల్ హీరో సోనుసూద్ ను 'మా' ఎన్నికల బరిలో నిలిపేందుకు కొందరు ప్రయత్నాలు చేస్తున్నారనే పుకారు ఒకటి పుట్టుకొచ్చింది.
'మా' అధ్యక్ష పదవి కోసం పోటీపడుతున్నట్లు ఇప్పటికే ప్రకాష్ రాజ్ - మంచు విష్ణు - జీవితా రాజశేఖర్ - హేమ - సీవీఎల్ నరసింహారావు వంటి వారు ప్రకటించారు. ఈ క్రమంలో రెండేళ్ల నుంచి ప్రణాళికలు రచిస్తున్నట్లు చెప్పిన ప్రకాశ్ రాజ్.. ఒకడుగు ముందుకేసి 27 మంది సభ్యులతో మీడియా ముఖంగా తన ప్యానెల్ ని ప్రకటించారు. ఈ నేపథ్యంలో లోకల్ - నాన్ లోకల్ అంశాలు తెరపైకి వచ్చాయి. అలానే 'మా' లో ఆంధ్రా - తెలంగాణ అనే కొత్త వాదన మొదలైంది. రాష్ట్రం విడిపోయింది కాబట్టి తెలంగాణ ఆంధ్రా కళాకారులకు వేరువేరుగా మూవీ ఆర్టిస్టు అసోసియేషన్స్ ఉండాలనే కామెంట్స్ వినిపించాయి. ఇక సీనియర్ నటుడు మురళీ మోహన్ వ్యాఖ్యలతో 'మా' ఎన్నికలు ఏకగ్రీవం అవుతాయని మరో వార్త వచ్చింది.
ఈ నేపథ్యంలో కరోనా సమయంలో తన సేవా కార్యక్రమాలతో దేశవ్యాప్తంగా ప్రజాదరణ పొందిన నేషనల్ హీరో సోనూసూద్ 'మా' అధ్యక్ష బరిలో ఉంటారని.. ఈ మేరకు కొందరు సినీ ప్రముఖులు తెర వెనుక పావులు కదుపుతున్నారని వార్తలు వస్తున్నాయి. ప్రకాష్ రాజ్ కు గట్టి పోటీ ఇచ్చేందుకే సోనూ ను రంగంలోకి దింపుతిన్నారని అంటున్నారు. అయితే సోనుసూద్ - మంత్రి కేటీఆర్ సమావేశం తర్వాత ఇలాంటి రూమర్స్ వస్తుండటం గమనార్హం. ఇదే కనుక నిజమైతే.. ప్రకాష్ రాజ్ నాన్ లోకల్ అంటూ బాహాటంగా కామెంట్స్ చేసిన వారు.. ఇప్పుడు సోనూసూద్ అభ్యర్థిత్వానికి మద్దతు ఇస్తారా అనేది చూడాలి.