Begin typing your search above and press return to search.
మహానటికి జాతీయ గుర్తింపు
By: Tupaki Desk | 9 Aug 2019 10:33 AM GMTగత ఏడాది టాప్ హిట్స్ లో ఒకటిగా నిలిచిన మహానటికి మరో అరుదైన గుర్తింపు దక్కింది. ఉత్తమ జాతీయ తెలుగు చిత్రంగా కేంద్ర ప్రభుత్వం అవార్డు ప్రకటించింది. దివంగత సావిత్రి జీవిత కథతో రూపొందిన ఈ సినిమా సుమారు 45 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి ట్రేడ్ ని సైతం ఔరా అనిపించింది. స్టార్ సపోర్ట్ లేకుండా కేవలం కీర్తి సురేష్ పెర్ఫార్మన్స్ నాగ అశ్విన్ టేకింగ్ మీద నడిచిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి అపూర్వ స్పందన దక్కింది.
విడుదలైన సమయంలో అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోల సినిమాలు పోటీలో ఉన్నా తట్టుకుని మరీ ఘన విజయం సాధించింది. ఇందులోని ఎమోషనల్ కంటెంట్ కి సావిత్రి గురించి తెలియని వారు కూడా కంటతడి పెట్టారంటే ఇది ఏ స్థాయిలో ప్రభావం చూపించిందో అర్థం చేసుకోవచ్చు దీని పట్ల పరిశ్రమ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
మంచి సినిమాకు సరైన గుర్తింపు లభించిందని ఎన్ని పురస్కారాలు ఇచ్చినా మహానటికి అవి అందుకునే అర్హత ఉందని పలువురు అభిప్రాయాలు పంచుకుంటున్నారు. స్వర్గానికేగి దశాబ్దాలు గడుస్తున్నా ఇప్పటికీ అవార్డులు గెలుచుకుంటున్న సావిత్రమ్మ గురించి తలుచుకుని సీనియర్ నటీనటులు ఆవిడ గొప్పదనాన్ని మరోసారి గుర్తు చేసుకుంటున్నారు. వైజయంతి సంస్థ ఈ నేషనల్ అవార్డు పట్ల గర్వంగా ఉంది. నాగ అశ్విన్ కొత్త సినిమా ఏర్పాట్లలో ఉండగా ఇలాంటి గుడ్ న్యూస్ వెలువడటం విశేషం