Begin typing your search above and press return to search.
ప్రభాస్ ని ఇరికించాలని అడ్డంగా బుక్కైందిగా!
By: Tupaki Desk | 2 Dec 2022 2:30 PM GMTప్రభాస్ గత కొంత కాలంగా తన పని తాను చేసుకుపోతున్నాడు. పెళ్లి వార్తలు చిలువలు పలువలుగా పుట్టుకొస్తున్నా లైట్ తీసుకుంటూ తను అంగీకరించిన ప్రాజెక్ట్ లని పూర్తి చేసే పనిలో పూర్తిగా నిమగ్నమయ్యాడు. అనుష్కతో పెళ్లి అన్నా..కృతిసనన్ తో ప్రేమలో వున్నాడని, పెళ్లికి రెడీ అయిపోతున్నాడని ప్రచారం జరిగినా పెద్దగా ప్రభాస్ పట్టించుకోలేదు..ఈ వార్తలపై స్పందించలేదు కూడా. ఇదిలా వుంటే ప్రభాస్ పై జాతీయ మీడియా పగపట్టిందా? అనే అనుమానాలు కలుగుతున్నాయి.
దీనికి కారణం తాజాగా ప్రభాస్ పై జాతీయ మీడియా ప్రాపగండ చేయడమే. జూబ్లీ హిల్స్ లో ప్రభాస్ కు 84 ఎకరాల విస్తీర్ణంలో ఓ భారీ లావిష్ ఫామ్ హౌస్ వుందని ఓ జాతీయ మీడియా ప్రత్యేక కథనాన్ని వండి వార్చింది. దీనిపై అందరి దృష్టి పడాలని మరీ ఆపసోపాటు పడిపోయి మరీ భారీ హెడ్డింగ్ నే పెట్టేసింది. దీన్ని బట్టే జాతీయ మీడియా ఏ స్థాయిలో అవగాహన రాహిత్యానికి పాల్పడింతో స్పష్టమవుతోంది. హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ ఏరియా ఎంత కాస్ట్లీనో అందరికి తెలిసిందే.
హైదరాబాద్ లో వుంటున్న వాళ్లకే కాకుండా ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు ఇరుగు పొరుగు స్టేట్ లకు చెందిన సెలబ్రిటీలకు ఈ విషయం సుపరిచితమే. గూగూల్ చేసినా ఇతర రాష్ట్రాల వారికి ఇట్టే తెలిసిపోతుంది. జూబ్లీ హిల్స్ ఏరియాలో లావిష్ బిల్డింగ్ వుందని, దాన్ని వందల కోట్లతో ప్రభాస్ నిర్మించుకున్నాడని రాసినా కొంత మేరకు నమ్మేవారేమో కానీ పోయి పోయి జూబ్లీ హిల్స్ ఏరియాలో 84 ఎకరాల విస్లీర్షంలో ఫామ్ హౌస్ అని హెడ్డింగ్ పెట్టేసి జాతీయ మీడియా అడ్డంగా దొరికిపోయింది.
ఈ వార్తలపై ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు టాలీవుడ్ సెలబ్రిటీలు జాతీయ మీడియాని ఆడేసుకుంటున్నారు. మరీ ఇంత అవగాహన రాహిత్యం అయితే ఎలా అంటూ జాతీయ మీడియాపై మండిపడుతున్నారు. ఈ వార్తలపై `బాహుబలి` నిర్మాతల్లో ఒకరైన శోభు యాకర్లగడ్డ మండిపడ్డారు. మీ తెలివి తెల్లారినట్టు వుందనే స్థాయిలో జాతీయ మీడియాకు చురకలంటించారు. దీంతో ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. తమ అవగాహన రాహిత్యాన్ని ఎండగట్టినా సదరు పోస్ట్ ని జాతీయ మీడియా డిలీట్ చేయకపోవడం గమనార్హం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.