Begin typing your search above and press return to search.

ఆ రోజు ఛాంబ‌ర్లో ప‌వ‌న్ ఏం చేశారంటే?

By:  Tupaki Desk   |   30 April 2018 5:26 AM GMT
ఆ రోజు ఛాంబ‌ర్లో ప‌వ‌న్ ఏం చేశారంటే?
X
త‌న త‌ల్లిని ఉద్దేశించి న‌టి శ్రీ‌రెడ్డి చేసిన అస‌భ్య‌క‌ర వ్యాఖ్య‌ల విష‌యంలో తీవ్ర ఆగ్ర‌హానికి గురైన జ‌న‌సేన అధినేత‌.. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫిలింఛాంబ‌ర్ వ‌ద్ద‌కు రావ‌టం.. సీరియ‌స్ కావ‌టం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్ అభిమానుల‌తో అక్క‌డి వాతావ‌ర‌ణం ఉద్రిక్తంగా మారింది. ప‌వ‌న్ త‌ర్వాత ఒక్కొక్క‌రుగా మెగా ఫ్యామిలీకి చెందిన వారంతా ఫిలిం ఛాంబ‌ర్ వ‌ద్ద‌కు చేరుకోవ‌టం.. కొంద‌రు న‌టులు కూడా రావ‌టంతో అస‌లేం జ‌రుగుతుందో అర్థం కాని ప‌రిస్థితి. ఒక‌ద‌శ‌లో ఛాంబ‌ర్ రూంలోకి వెళ్లి ప‌వ‌న్ త‌లుపులు వేసుకున్నార‌ని.. దీక్ష చేస్తున్న‌ట్లుగా కొన్ని ఛాన‌ల్స్ లో స్క్రోలింగ్స్ ప‌డ్డాయి.

ఈ ఎపిసోడ్‌ లో ప‌వ‌న్ బ‌య‌ట‌కు వ‌చ్చి మీడియాతో మాట్లాడతారంటూ ప్ర‌చారం జ‌రిగినా.. ఏమీ మాట్లాడ‌కుండానే ప‌వ‌న్ వెళ్లిపోయారు. ఫిలింఛాంబ‌ర్‌ కు ప‌వ‌న్ ఎందుకు వ‌చ్చారు? ఏం చేశారు? అస‌లు ఫిలింఛాంబ‌ర్లో ఏం జ‌రిగింది? అన్న‌ది పెద్ద క్వ‌శ్చ‌న్ మార్క్ మాదిరి త‌యారైంది. తాజాగా ఆ రోజు ఏం జ‌రిగిందన్న‌ది బ‌య‌ట‌పెట్టారు నట్టికుమార్‌.

ఫిలింఛాంబ‌ర్ వ‌ద్ద‌కు ప‌వ‌న్ క‌ల్యాణ్ వ‌చ్చిన త‌ర్వాత త‌న‌ను కూడా ర‌మ్మ‌ని క‌బురు పెట్టార‌ని.. ఆ టైంలోతాను అర్జెంట్ ప‌ని మీద గోవా వెళుతున్నాన‌ని.. అందుకే రాలేకపోయిన‌ట్లు న‌ట్టి చెప్పారు. ఫిలిం ఛాంబ‌ర్ ఎపిసోడ్ తర్వాత అన్న‌పూర్ణ స్టూడియోలో జ‌రిగిన మీటింగ్‌ కు ఛాంబ‌ర్ వాళ్లు కొంద‌రు వెళ్లార‌ని.. వారంద‌రిని బ‌య‌ట‌కు పంపేశార‌న్నారు. ఈ మీటింగ్ మాది.. మీది కాదని వ్యాఖ్యానించార‌న్న న‌ట్టి.. ఆ వ్యాఖ్య‌ల‌పై అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు.

ఈ ఇండ‌స్ట్రీ మీ సొంత‌మా? 20 మందే ఇండ‌స్ట్రీ కాదు క‌దా? ల‌క్ష‌ల్లో ఉన్నార‌న్న ఆయ‌న‌.. శ్రీ‌రెడ్డి విష‌యంలో ఛాంబ‌ర్ వారు పోలీసుల‌కు ఎందుకు ఫిర్యాదు చేయ‌లేద‌ని ప్ర‌శ్నించారు. జ‌రిగిన‌ దాంట్లో ఛాంబ‌ర్ త‌ప్పు ఉండ‌టం వ‌ల్లే మౌనంగా ఉన్నార‌న్నారు. శ్రీ‌రెడ్డి చేత ప‌వ‌న్ ను తిట్టించిన వారిలో ఒక వ‌ర్గం ఉంద‌ని న‌ట్టి ఆరోపించారు.

తాను కాపునే అయినా.. ఆ వ‌ర్గానికి చెందిన వాడిగా తాను మాట్లాడ‌టం లేద‌ని.. ఆ మాట‌కు వ‌స్తే సినిమా ఇండ‌స్ట్రీకి కులం లేద‌న్నారు. ప‌వ‌న్ ట్వీట్స్ కార‌ణంగా ఇండ‌స్ట్రీ రెండు వ‌ర్గాలుగా చీలిపోయింద‌న్న ప్ర‌శ్న‌కు బ‌దులిచ్చిన న‌ట్టి.. 2009లో ఇదే రీతిలో ప్ర‌జారాజ్యం పార్టీ ఏర్పాటు చేసిన‌ప్పుడు చిరంజీవి కాపు అని ప‌బ్లిసిటీ చేసి మిగిలిన వారికి దూరం చేశార‌న్నారు. ఇప్పుడు ప‌వ‌న్ విష‌యంలోనూ అదే జ‌రుగుతోంద‌న్నారు. అందుకే.. ప‌వ‌న్ మొద‌ట్నించి క్లారిటీగా చెబుతున్నార‌ని.. తాను ఏ ఒక్క కులానికి చెందిన వాడిని కాన‌న్న విష‌యాన్ని ఇప్ప‌టికే స్ప‌ష్టం చేసిన వైనాన్ని గుర్తు చేశారు.

తాను ప‌వ‌న్ ను స‌మ‌ర్థించ‌టం లేద‌ని.. ఆయ‌న పార్టీలో లేన‌ని.. ఇప్ప‌టికి తాను కాంగ్రెస్‌లోనే కొన‌సాగుతున్న విష‌యాన్ని గుర్తు చేశారు న‌ట్టికుమార్‌. శ్రీ‌రెడ్డి ఇష్యూలో మా స‌భ్యులు త‌ప్పులు చేసిన‌ట్లుగా విమ‌ర్శించిన న‌ట్టికుమార్‌.. ఆ అమ్మాయి మీద బ్యాన్ ఎందుకు విధించారు? ఎందుకు ఎత్తివేశారు? అని ప్ర‌శ్నించారు. శ్రీ‌రెడ్డి ఇష్యూలో మా స‌భ్యులు త‌ప్పులు చేశార‌ని.. అందుకు అసోసియేష‌న్ బాడీ మొత్తం రాజీనామాలు చేయాల‌న్నారు.

ఇక‌.. ఫిలింఛాంబ‌ర్ ద‌గ్గ‌ర‌కు వ‌చ్చిన ప‌వ‌న్ వ‌చ్చిన‌ప్పుడు జ‌రిగిన విష‌యాల్ని వెల్ల‌డిస్తూ.. త‌న త‌ల్లిని తిట్టించార‌న్న మాట‌తో పాటు.. ఛాంబ‌ర్ ఏం చేస్తోంది? అని నిల‌దీసిన‌ట్లుగా చెప్పారు. ఈ ఇష్యూ మీద డీజీపీకి ఫిర్యాదు ఎందుకు ఇవ్వ‌లేద‌న్న క్వ‌శ్చ‌న్ ను సంధించిన‌ట్లు చెబుతున్నారు. అస‌లు ఇష్యూ ఎక్క‌డిది? నా మీద‌కు ఎందుకు వ‌చ్చింది? అని ఆయ‌న అడిగిన‌ట్లు చెప్పారు. త‌న‌కుసంబంధం లేని విష‌యం త‌న మీద‌కు తేవ‌టం.. త‌న త‌ల్లిని తిట్టించ‌టం ప‌ట్ల తీవ్ర అస‌హ‌నాన్ని.. అసంతృప్తిని వ్య‌క్తం చేసిన‌ట్లుగా చెప్పారు.