Begin typing your search above and press return to search.
బాహుబలికి ఇచ్చి.. బ్రూస్ లీకి ఇవ్వరా?
By: Tupaki Desk | 23 Dec 2015 10:30 PM GMTపెద్ద హీరోల సినిమాలనగానే తెల్లవారుజామున బెనిఫిట్ షోలు వేయడం ఈ మధ్య మామూలైపోయింది. పోలీసు శాఖకు ఓ మూడు వేలు కట్టేసి అనుమతి సంపాదించేస్తే చాలు.. టికెట్ రేటు డిమాండును బట్టి ఐదొందలో వెయ్యో రెండు వేలో పెట్టేసి అమ్మేసుకోవచ్చు. లక్షలు లక్షలు వెనకేసుకోవచ్చు. షో మీద వచ్చే డబ్బులు ఛారిటీ కోసం అని చెప్పి వ్యవహారం నడిపే జనాలు కూడా లేకపోలేదు. అందులో చాలా వరకు అబద్ధాలే. అయినా తమ హీరోల మీద అభిమానంతో ఫ్యాన్స్ ఎంతైనా పెట్టి టికెట్లు కొంటున్నారు, తెల్లవారుజామునే సినిమా చూసి పరవశించిపోతున్నారు. ఐతే ఈ బెనిఫిట్ షోలకు అనుమతులిచ్చే విషయంలో కొన్ని చోట్ల గొడవలు జరుగుతున్నాయి.
దసరాకు ముందు ‘బ్రూస్ లీ’ మూవీ బెనిఫిట్ షో విషయంలో పెద్ద గొడవే జరిగింది. వైజాగ్ లో నట్టికుమార్ థియేటర్లో బ్రూస్ లీ అర్ధరాత్రి తర్వాత బెనిఫిట్ షో వేయడానికి అనుమతివ్వకపోవడం.. ఉదయం ఏడున్నరకు షో మొదలుపెట్టాక కూడా పోలీసులు వచ్చి అడ్డుకోవడం.. షో ఆపినప్పటికీ నట్టి కుమార్ థియేటర్ కు లైసెన్స్ కూడా రద్దు చేయడం పెద్ద వివాదమైంది. దీనిపై నట్టి కుమార్ పెద్ద పోరాటమే చేస్తున్నాడు. బాహుబలి సినిమాకు 23 థియేటర్లలో - శ్రీమంతుడుకి 18 థియేటర్లలో స్పెషల్ షోలకు విశాఖ జాయింట్ కలెక్టర్ అనుమతి ఇచ్చారని.. ఈ షోల ద్వారా వచ్చిన లాభాల్లో కొంత మొత్తం శాతాన్ని పాఠశాలల్లో మరుగుదొడ్లు - ఫర్నిచర్ కు కేటాయిస్తామని షోలు వేసిన సంస్థ హామీ ఇచ్చిందని.. కానీ తర్వాత ఒక్క పైసా కూడా ఇవ్వకుండా భారీగా వెనకేసుకుందని ఆరోపిస్తున్నాడు నట్టి. ఈ వ్యవహారమై అతను సీబీఐకి రిపోర్ట్ చేయడం విశేషం. రెవెన్యూ ఉన్నతాథికారి స్నేహితుడు ఒకరు, మంత్రి అల్లుడు ఒకరు కలిసి బాహుబలి - శ్రీమంతుడు బెనిఫిట్ షోల పేరిట కోటిన్నర కుంభకోణానికి పాల్పడ్డారన్నది నట్టి కుమార్ ఆరోపణ. ఈ వ్యవహారాల్లో వాస్తవాలేంటో నిగ్గు తేల్చాలని నట్టి డిమాండ్ చేస్తున్నాడు.