Begin typing your search above and press return to search.
ఆస్పత్రిలో నట్టికుమార్... కల్యాణ్ దే బాధ్యత!
By: Tupaki Desk | 29 Aug 2016 11:16 AM ISTగ్యాంగ్ స్టర్ నయీంతో టాలీవుడ్‌కు చెందిన పలువురి నిర్మాతలకు సంబంధాలున్నాయని, సినిమా థియేటర్స్ లోని క్యాంటిన్స్ అన్నీ ఆయన ఆధీనంలోనివే అని సంచలన ఆరోపణలు చేసిన టాలీవుడ్ సినీనిర్మాత నట్టికుమార్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలోని ఐసీయూ వార్డులో ఆయన చికిత్స పొందుతున్నారు. నయీంతో నిర్మాత సి.కల్యాణ్ కు సంబంధాలున్నాయంటూ ఈయన చేసిన ఆరోపణలు టాలీవుడ్ లో పెను ప్రకంపనలు రేపాయి. ఈ ఆరోపణలపై స్పందించిన సి.కల్యాణ్ నట్టికుమార్ పై వ్యక్తిగత ఆరోపణలు గుప్పించడం, నట్టికుమార్ కు - సి. కల్యాణ్ కు మధ్య మాటల యుద్ధం జరగడం తెలిసిందే.
అయితే ఈ సందర్భంలోనే నట్టికుమార్ తీవ్ర ఒత్తిడికి లోనయ్యారని తెలిపిన ఆయన పిల్లలు క్రాంతి, కరుణ్ లు ఆయన్ని యశోద ఆస్పత్రిలో చేర్పించారు. తమ తండ్రి తీవ్ర ఒత్తిడికి గురయ్యారని, ఆయన ఇప్పుడూ ఐసీయూ వార్డులో ఉన్నారని, తమ తండ్రికి ఏమైనా జరిగితే దానికి కాధ్యత సి. కల్యాణే వహించాలని వారు పేర్కొన్నారు.
సి.కల్యాణ్ కు నయీంతో సంబంధాలున్నాయి కాబట్టే తన తండ్రి ఆరోపణలు చేశారని, ఆయన ఆసుపత్రి నుంచి బయటకు రాగానే ఆ ఆరోపణలను ఆధారాలతో సహా నిరూపిస్తామని నట్టికుమార్ పిల్లలు చెబుతున్నారు. తమ కుటుంబ వ్యక్తిగత విషయాలపై ఆరోపణలు చేయడం కల్యాణ్ కు తగదని.. ఇలా నిరాధారమైన ఆరోపణలు చేస్తే తామే సి. కల్యాణ్ ని చెప్పుతో కొడతామని హెచ్చరించారు.
కాగా టాలీవుడ్ కు చెందిన నిర్మాత సి.కల్యాణ్ తోపాటు నిర్మ్ అశోక్ కుమార్ - బండ్ల గణేశ్ - సచిన్ జోషిలకు నయీంతో సంబంధాలున్నాయంటూ నట్టి కుమార్ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.